నెట్ ఫ్లిక్స్ షో ‘ఖాకీ’కి స్ఫూర్తిగా నిలిచిన ఐపీఎస్ అమిత్ లోధాపై అవినీతి కేసు.. ఎందుకంటే ?

By team teluguFirst Published Dec 9, 2022, 9:38 AM IST
Highlights

బీహార్ కేడర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అమిత్ లోధాపై అవినీతి నిరోధక చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఆయన రాసిన స్టోరీ ఆధారంగా ‘ఖాకీ: ది బీహార్ చాప్టర్’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ సిరీస్ కు ఆయనే స్ఫూర్తిగా నిలిచారు. 

‘ఖాకీ’ వెబ్ సిరీస్ విడుదల తర్వాత వెలుగులోకి వచ్చిన బీహార్ కేడర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అమిత్ లోధాపై బీహార్ పోలీసు స్పెషల్ మానిటరింగ్ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్లు 120 (బి), 168 (చట్టవిరుద్ధంగా వ్యాపారంలో పాల్గొనడం) కింద లోధాపై కేసులు నమోదయ్యాయి.

పెళ్లి వేడుకల్లో పేలిన గ్యాస్ సిలిండర్.. నలుగురు సజీవదహనం.. 50 మందికి గాయాలు..

వెబ్ సిరీస్ కోసం లోధా నల్లధనాన్ని ఉపయోగించారని పోలీసు ఎఫ్ఐఆర్ పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఓ పుస్తకం రాసి వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి లోధాకు అధికారం లేదని తెలిపింది. ప్రభుత్వోద్యోగిగా ఉన్నప్పటికీ అప్పటి మగధ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ అమిత్ లోధా ఖాకీ వెబ్ సిరీస్ నిర్మించిన నెట్ ఫ్లిక్స్, ఫ్రైడే స్టోరీ టెల్లర్ ప్రైవేట్ లిమిటెడ్ తో ప్రైవేట్ లేదా వాణిజ్య కార్యకలాపాలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదు అయ్యాయి. 

మాండౌస్ తుఫాను: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిల‌కు భారీ వ‌ర్షం-బ‌ల‌మైన‌ గాలుల హెచ్చ‌రిక‌లు జారీ

కాగా.. లోధా ప్రమేయం, కార్యకలాపాల దృష్ట్యా ఏజెన్సీ సంస్థలు సమర్పించిన దర్యాప్తు నివేదికను పోలీసులు సమీక్షించి చర్యలు తీసుకున్నారు. ‘‘ అక్రమంగా సంపాదించడానికి, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి ఆయన రాసిన ‘బీహార్ డైరీ’ పుస్తకాన్ని ‘ఖాకీ ది బీహార్ చాప్టర్’ వెబ్ సిరీస్ కోసం ఉపయోగించాడు.’’ అని కేసు నమోదు అయ్యింది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో గెలిచిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ ను వీడని స‌మ‌స్య‌లు..?

బీహార్ లోని షేక్ పురా జిల్లాలో ఉగ్రవాద పాలనను సృష్టించిన భయంకరమైన గ్యాంగ్ స్టర్ ను ఒక పోలీసు అధికారి ఎలా పట్టుకుంటాడు అనే స్టోరీతో ‘ఖాకీ: ది బీహార్ చాప్టర్’ అనే వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది. ఇది లోధా స్వయంగా రాసిన బీహార్ డైరీస్ అనే పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. 
 

click me!