మాండౌస్ తుఫాను: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిల‌కు భారీ వ‌ర్షం-బ‌ల‌మైన‌ గాలుల హెచ్చ‌రిక‌లు జారీ

By Mahesh RajamoniFirst Published Dec 9, 2022, 2:23 AM IST
Highlights

IMD: మాండౌస్ తుఫాను క్ర‌మంలో ఐఎండీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలకు భారీ వర్షాలు, వీదురుగాలుల‌ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాను గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం తీవ్ర తుఫానుగా మారి శుక్రవారం సాయంత్రానికల్లా మళ్లీ తుఫానుగా మారే అవకాశం ఉంద‌ని స‌మాచారం. 
 

Cyclone Mandous: బుధవారం సాయంత్రం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుఫాను తీవ్ర తుఫానుగా మారుతుందనీ, గురువారం రాత్రి-శుక్రవారం ఉదయం వ‌రుస‌గా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో, 85-95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇది క్రమంగా బలహీనపడి తుఫానుగా మారి శుక్రవారం అర్ధరాత్రి మహాబలిపురం సమీపంలో తమిళనాడు తీరాన్ని చేరుతుందని ఐఎండీ పేర్కొంది. 

మాండౌస్ తుఫాను క్ర‌మంలో ఐఎండీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలకు భారీ వర్షాలు, వీదురుగాలుల‌ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాను గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం తీవ్ర తుఫానుగా మారి శుక్రవారం సాయంత్రానికల్లా మళ్లీ తుఫానుగా మారే అవకాశం ఉంద‌ని స‌మాచారం. 
"సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, సముద్రపు వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు సహా వాతావరణ, సముద్ర పరిస్థితులు సైక్లోజెనిసిస్‌కు అనుకూలంగా ఉంటాయి, కాబట్టి ఇది ఈ రాత్రికి తీవ్రతను పొందుతుంది.. అయితే,  శుక్రవారం, ఇది భూ ఉపరితలానికి దగ్గరగా కదులుతున్నప్పుడు, మాండౌస్ మళ్లీ తుఫానుగా బలహీనపడుతుంది. ఈ స‌మ‌యంలో భూమి నుండి పొడి గాలులు వీస్తాయని కూడా మేము అంచ‌నా వేస్తున్నాం.. అది తుఫాను బలహీనపడటానికి సహాయపడుతుంది” అని IMD డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్ర అన్నారు.

నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మాండౌస్ తుఫాను దాదాపు పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ గురువారం మధ్యాహ్నం శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 250 కిలో మీట‌ర్ల జాఫ్నాకు తూర్పున 350 కిలో మీట‌ర్లు, పుదుచ్చేరిలోని కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 390 కిలో మీట‌ర్లు,  చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలో మీట‌ర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ని పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య, మహాబలిపురం చుట్టూ, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గరిష్టంగా 65-75kmph వేగంతో గాలులు వీచే అవ‌కాశ‌ముంది. "గురు, శుక్రవారాల్లో ప‌లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు బలమైన గాలుల ప్ర‌భావానికి గుర‌వుతాయ‌ని ఐఎండీ అంచనా వేసింది.

కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో గురువారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో గంటకు 75-85 కిలోమీటర్ల వేగంతో  గాలులు వీస్తున్నాయి. ఇది గురువారం రాత్రికి 80-90kmph వేగం నుంచి 100kmph కు పెరుగుతుంది. క్రమంగా 75-85kmph వేగంతో శుక్రవారం ఉదయం 95kmph కు తగ్గుతుందని ఐఎండీ పేర్కొంది. 
కాగా, గురువారం నుండి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ ల‌తో పాటు ఉత్తర శ్రీలంక తీరాల వెంబడి గంట‌కు 40-50kmph వేగంతో ప్రారంభ‌మైన వీదురు గాలులు 60kmph వేగంతో ముందుకు సాగుతాయ‌ని అంత‌కు ముందు ఐఎండీ అంచనా వేసింది. శుక్రవారం ఉదయం నుండి 50-60kmph నుండి 70kmph వ‌ర‌కు, ఆ త‌ర్వాత 65-75kmph నుండి 85kmph వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం నుండి శనివారం తెల్లవారుజాము వరకు ఇదే ప‌రిస్థితులు ఉండే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది.

click me!