విద్యార్థినులపై కరస్పాండెంట్ లైంగిక వేధింపులు.. తల్లిదండ్రుల భారీ ఆందోళన..

By team teluguFirst Published Nov 24, 2022, 11:34 AM IST
Highlights

తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కరస్పాండెంట్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో తల్లిందండ్రులు, విద్యార్థులు నిరసన చేపట్టారు. అధికారులు అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. 

విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పాల్సిన ఆ కరస్పాండెంట్ కామంతో వ్యవహరించాడు. వారిని లైంగికంగా వేధించాడు. ఈ విషయం బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు స్కూల్ ఆవరణకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. బాలికలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

రాహుల్ భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ..

వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం తిరునిండ్రవూర్‌లోని ఏంజెల్‌ మెట్రిక్‌ పాఠశాలకు చెందిన కరస్పాండెంట్ వినోద్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత కొంత కాలంగా ఆయన 12వ తరగతి చదవే బాలికు స్పెషల్ కౌన్సిలింగ్ ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వేధిస్తున్నాడు. టీచర్ లపై కూడా అతడు అదే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాల యాజమాన్యానికి అనేక సార్లు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి ఫలితమూ లేకుండా పోయింది. 

స్కూల్లో తప్పతాగి నిద్రపోయిన ప్రిన్సిపల్... వీడియో వైరల్...!

దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల కరస్పాండెంట్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన చేపట్టారు. గంటల తరబడి ఆందోళన నిర్వహించారు. రహదారులను దిగ్బంధించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇతర అధికారులు కూడా అక్కడికి చేరుకుని విద్యార్థులతో, తల్లిదండ్రులతో మాట్లాడారు. దీంతో జరిగిన విషయం వారికి వివరించారు. నిందితుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. 

పార్టీ మారాలనే ఐటీ దాడులు: మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి

బాధితుల ఫిర్యాదు ఆధారంగా ఆ కరస్పాండెంట్ పై పోక్సో చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత నిరసనకారులు తమ ఆందోళనను నిలిపివేశారు. నిందితుడు వినోద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

టీ కాంగ్రెస్‌పై అధిష్టానం ఫోకస్.. రేవంత్‌పై నేతల అసంతృప్తి, ఫిర్యాదులపై మల్లికార్జున ఖర్గే ఆరా..!

కాగా.. విద్యార్థుల ఆందోళనలతో పాఠశాల ఆవరణలో ఉద్రిక్తత పరస్థితులు నెలకొన్నాయి. దీంతో పాఠశాల యాజమాన్యం నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఆందోళన చేయకూడదని కోరింది. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతూ తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ లు పంపించింది. 

click me!