దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్న కారణంగా, కొన్ని రంగాలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే అక్కడ సామాజిక దూరం కచ్చితంగా పాటించాలన్న కఠిన నిబంధనలను కేంద్రం విధించినుంది.
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 6వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.ఈ వైరస్ ని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ ప్రకటించగా... అది మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో.. ఈ లాక్ డౌన్ విషయంలో ప్రధాని మోదీ మంగళవారం కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
Also Read లాక్ డౌన్ లో బంధు మిత్రులతో విందు భోజనాలు.. వ్యాపారవేత్తలు అరెస్ట్...
అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం. అయితే అత్యవసర సర్వీసులకు మాత్రం ఇందుకు మినహాయింపు ఇవ్వనున్నారని సీనియర్ అధికారులు తెలిపారు. ఇక, విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలను మూసే ఉంచుతారని స్పష్టం చేశారు.
దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్న కారణంగా, కొన్ని రంగాలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే అక్కడ సామాజిక దూరం కచ్చితంగా పాటించాలన్న కఠిన నిబంధనలను కేంద్రం విధించినుంది. అత్యంతగా నష్టపోయిన రంగాల్లో విమాన రంగం ప్రథమ వరుసలో ఉంది.
దీంతో విమానాల రాకపోకలను క్రమంగా ప్రారంభించవచ్చని అయితే, అన్ని తరగతులలో మధ్య సీటు ఖాళీగా ఉంచాలన్న నిబంధనను తెరపైకి తేనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కొన్ని సడలింపులతో లాక్ డౌన్ ని ఈ నెల 30 వరకు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.