లాక్ డౌన్ లో బంధు మిత్రులతో విందు భోజనాలు.. వ్యాపారవేత్తలు అరెస్ట్

By telugu news teamFirst Published Apr 10, 2020, 11:36 AM IST
Highlights

మహారాష్ట్ర హిల్ రిసార్ట్‌లోని వారి ఫామ్‌హౌస్‌ లో విందు చేసుకుంటున్న వీరిని అరెస్ట్ చేశారు. అంతేకాదు వీరికి అక్కడికి వెళ్లేందుకు అనుమతిచ్చిన ఐఎఎస్ అధికారిపై వేటు వేశారు.

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 6వేల కేసులు పెరిగిపోయాయి. ఈ కేసులను ఎలా తగ్గించాలా.. కరోనాని ఎలా అరికట్టాలా అని ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో... చదువుకొని ఉన్నత స్థానంలో ఉన్నవారే.. లాక్ డౌన్ ని అతిక్రమిస్తున్నారు.

Also Read కరోనా ఎఫెక్ట్: పోలీసులను తప్పించుకొనేందుకు ఈదుకొంటూ మృత్యు ఒడిలోకి...

తాజాగా..యస్ బ్యాంక్ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు బిలియనీర్లు కపిల్ వాధ్వాన్,  ధీరజ్ వాధ్వాన్ లు లాక్ డౌన్ ని అతిక్రమించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మహారాష్ట్ర హిల్ రిసార్ట్‌లోని వారి ఫామ్‌హౌస్‌ లో విందు చేసుకుంటున్న వీరిని అరెస్ట్ చేశారు. అంతేకాదు వీరికి అక్కడికి వెళ్లేందుకు అనుమతిచ్చిన ఐఎఎస్ అధికారిపై వేటు వేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...బిలియనీర్లు కపిల్ వాధ్వాన్,  ధీరజ్ వాధ్వాన్ లు లాక్ డౌన్ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఫామ్ హౌస్ లో విందు భోజనం ఏర్పాటు చేసుకున్నారు.

ఆరు హై-ఎండ్ వాహనాలను గుర్తించిన స్థానికులు వెంటనే మునిసిపల్ అధికారులకు తహశీల్దార్ కు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇద్దరు డిహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లతో సహా మొత్తం 23 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అత్యవసరం పరిస్థితి పేరుతో పాస్లు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అమితాబ్ గుప్తాను బలవంతపు సెలవుపై పంపారు. 

click me!