మద్యం ప్రియులకు సీఎం బంపర్ ఆఫర్: లిక్కర్ హోం డెలివరీకి గ్రీన్‌సిగ్నల్

By Siva Kodati  |  First Published Apr 8, 2020, 8:40 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా సామాన్యుల బాధలు ఒక ఎత్తైతే.. మందు బాబులది మరో ఆవేదన. చుక్క లేనిదే నిద్రపోని మద్యం ప్రియులు లాక్‌డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు


కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా సామాన్యుల బాధలు ఒక ఎత్తైతే.. మందు బాబులది మరో ఆవేదన. చుక్క లేనిదే నిద్రపోని మద్యం ప్రియులు లాక్‌డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

ఇల్లు దాటే పరిస్ధితి లేకపోవడం, ఎక్కడా మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో మందు బాబుల బాధలను అర్థం చేసుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారికి శుభవార్త చెప్పారు.

Latest Videos

Aslo Read:24 గంటల్లో 773 కేసులు, 32 మరణాలు: భారత్‌లో 5,247కి చేరిన కరోనా కేసులు

లాక్‌డౌన్ సమయంలో రాష్ట్రంలో మద్యం హోమ్ డెలివరీకి సీఎం ఆమోద ముద్ర వేశారని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే లాక్‌డౌన్ వల్ల మూతపడ్డ మద్యం షాపులను తెరవబోమని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.

అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న వారికి మాత్రం మద్యం షాపుల నుంచి హోం డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. మద్యం షాపు యజమానులకు స్థానిక పోలీస్ స్టేషన్‌లలో హోం డెలివరీకి సంబంధించిన పాస్‌లు జారీ చేస్తామని.. ఇందుకోసం మద్యం విక్రేతలు పోలీసులను సంప్రదించాలని బెంగాల్ ఎక్సైజ్ శాఖ తెలిపింది.

ఒక్కో షాపుకు మూడు డెలివరీ పాస్‌లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికార వర్గాలు వెల్లడించాయి. వినియోగదారులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో వారి ఫోన్ల ద్వారా మద్యం కొనుగోలుకు ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది.

Aslo Read:కరోనా దెబ్బ: యూపీ 15 జిల్లాల్లో హాట్ స్పాట్స్ మూసివేత, మాస్క్ తప్పనిసరి

వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మద్యం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర అబ్కారీ శాఖ తెలిపింది. కాగా, ఇటీవలే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ స్వీట్ షాపులను కొన్ని గంటల పాటు తెరచి ఉంచేందుకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

click me!