24 గంటల్లో 773 కేసులు, 32 మరణాలు: భారత్‌లో 5,247కి చేరిన కరోనా కేసులు

By Siva KodatiFirst Published Apr 8, 2020, 7:06 PM IST
Highlights

భారతదేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం నాటికి దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 5,247 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ కాగా, వీరిలో 411 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.

భారతదేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం నాటికి దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 5,247 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ కాగా, వీరిలో 411 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.

కాగా ఇప్పటి వరకు వైరస్ కారణంగా 149 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 74 గంటల్లో 773 కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. కరోనా హాట్‌స్పాట్‌లలో లాక్‌డౌన్ మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు.

Also Read:కరోనా దెబ్బ: యూపీ 15 జిల్లాల్లో హాట్ స్పాట్స్ మూసివేత, మాస్క్ తప్పనిసరి

ప్రజలకు అవసరమైన నిత్యావసరాల సరఫరాను సాధారణ స్థాయికి తెచ్చామన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలతో కలిసి కేంద్రం సిద్ధంగా ఉందని లవ్ అగర్వాల్ వెల్లడించారు.

ఆసుపత్రుల్లో మెడికల్ సిబ్బందికి వైరస్ సోకకుండా ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు  తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా ఆసుపత్రుల ఏర్పాటు, నిరంతర నిఘా, కాంటాక్ట్ కేసుల ట్రేసింగ్ అంశాలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించిందని లవ్ అగర్వాల్ తెలిపారు.

Also Read:14న లాక్ డౌన్ ఎత్తేసే ఆలోచన లేదు: ప్రధాని నరేంద్ర మోడీ

ప్రస్తుతం కరోనా కట్టడిలో సత్ఫలితాలను ఇస్తున్న హైడ్రోక్సి‌క్లోరోక్విన్ నిల్వలు దేశంలో సరిపడా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు 1,21,271 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌కి చెందిన గంగా ఖేద్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో మరణాల సంఖ్య తక్కువేనని, మహారాష్ట్రలో మాత్రం ఈ సంఖ్య తక్కువగా ఉందని ఆయన అన్నారు. 

click me!