250 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.10 వేలు ఛార్జీ.. ఎన్ఆర్ఐల విమర్శలు

By Siva Kodati  |  First Published May 14, 2020, 9:07 PM IST

లాక్‌డౌన్ కారణంగా రోజుల తరబడి దేశం కానీ దేశంలో తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొన్న ఎన్ఆర్ఐలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. 


లాక్‌డౌన్ కారణంగా రోజుల తరబడి దేశం కానీ దేశంలో తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొన్న ఎన్ఆర్ఐలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. కరోనాతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా ఢిల్లీ చేరుకుని క్వారంటైన్ ముగించుకుని సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ) క్యాబ్, బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచింది.

Latest Videos

undefined

Also Read:ప్రయాణీకులూ పారాహుషార్.. మీ చిరునామాలు రైల్వేశాఖ చేతిలో...!!

అయితే ఈ సేవలకు సంబంధించి వసూలు చేస్తున్న ఛార్జీలు మాత్రం ప్రయాణీకులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. 250 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.10,000 అద్దె వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూపీలోని నోయిడా, ఘజియాబాద్‌తో పాటు 250 కిలోమీటర్ల ప్రయాణానికి సెడాన్ మోడల్ కారుకు రూ.10 వేలు, ఎస్‌యూవీ మోడల్‌కు రూ.12,000 అద్దె చెల్లించాలని ప్రభుత్వం తెలిపింది.

Also Read:ప్రభుత్వోద్యోగులకు శుభవార్త: ఏడాదికి 15 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్

అలాగే 26 సీట్లు ఉన్న బస్సులో 100 కిలోమీటర్ల దూరానికి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే క్వారంటైన్ ముగించుకుని తిరిగి స్వస్థలాలకు వెళ్లే వలస కార్మికులకు మాత్రం ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు యూపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.

కాగా లాక్‌డౌన్‌కు ముందు ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి నోయిడాకు క్యాబ్ సర్వీస్ కేవలం రూ.800కు అందుబాటులో ఉండేది. యూపీ ప్రభుత్వం తీరుపట్ల పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

click me!