ఇండియాలో 24 గంటల్లో 909 కేసులు: 9 వేలకు చేరువలో బాధితులు, మరణాలు 273

By Siva Kodati  |  First Published Apr 12, 2020, 6:49 PM IST

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 909 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు


దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 909 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన 24 గంటల్లో 34 మంది మరణించినట్లు తెలిపారు. మొత్తం కేసుల సంఖ్య 8,356కి చేరగా, మరణాల సంఖ్య 273కి చేరిందని లవ్ అగర్వాల్ వెల్లడించారు.

Latest Videos

Also Read:ముంబై తాజ్‌హోటల్‌లో ఆరుగురికి కరోనా: ఉద్యోగుల్లో ఆందోళన

ఇప్పటి వరకు 716 మంది కరోనా నుంచి బయటపడ్డారని, మార్చి 29 నాటికి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 979 కాగా..ప్రస్తుతం ఆ సంఖ్య వేగంగా దూసుకెళ్తోందని లవ్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

కేసులకు తగ్గట్టుగానే దానిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం  సర్వ సన్నద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 9 నాటికి 1,100 పడకల బెడ్లు  అవసరమైతే తాము 85 వేల పడకలు సిద్ధం చేశామని... నేడు 1,671 పడకలు అవసరమైతే 601 ఆసుపత్రుల్లో లక్షా 5 వేల పడకలు సిద్ధం చేశామని లవ్ అగర్వాల్ చెప్పారు.

దేశంలో 151 ప్రభుత్వ, 68 ప్రైవేట్ కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఐసీఎంఆర్‌కు చెందిన డాక్టర్ మనోజ్ ముర్కేకర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 1,86,906 మంది శాంపీళ్లను పరీక్షించినట్లు మనోజ్ చెప్పారు.

Also Read:కరోనాను జయించిన ఆర్నెళ్ల చిన్నారి: చప్పట్లు, విజిల్స్‌తో స్వాగతం

గత ఐదురోజులుగా రోజుకు సగటున 15,747 శాంపిళ్లను పరీక్షిస్తుండగా.. అందులో 584 కేసులు పాజిటివ్‌గా తేలుతున్నట్లు వెల్లడించారు. కరోనా కట్టడికి 40 వ్యాక్సిన్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని... అవేవీ తదుపరి దశకు చేరుకోలేదని మనోజ్ పేర్కొన్నారు.

దీంతో ఈ వైరస్‌కు సంబంధించి ప్రస్తుతానికి ఏ వ్యాక్సిన్ అందుబాటులో లేదన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేట్ వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చినట్లు  ముర్కేకర్ పేర్కొన్నారు.

click me!