coronavirus : ఢిల్లీలో కరోనా విజృంభ‌ణ.. ఒక్క రోజే 21,259 కోవిడ్ -19 కొత్త కేసులు

By team telugu  |  First Published Jan 11, 2022, 7:13 PM IST

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా  21,259 కోవిడ్ -19 కేసులు న‌మోద‌య్యాయి. కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. 


ఢిల్లీలో (delhi) క‌రోనా విజృంభిస్తోంది. క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డి కోసం ఢిల్లీ ప్ర‌భుత్వం ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటోంది. అందులో భాగంగా నైట్ క‌ర్ఫ్యూ, వీకెండ్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తోంది. అలాగే ప్ర‌జ‌లు గుమి గూడ‌కుండా ఆంక్ష‌లు విధించింది. అయినా పెరుగుద‌ల ఆగ‌డం లేదు.

గ‌డిచిన 24 గంట‌ల్లో ఢిల్లీలో కొత్త‌గా  21,259 కోవిడ్ -19 (covid -19)కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశ రాజ‌ధానిలో టెస్ట్ పాజిటివిటీ రేటు (test positivity rate) 25.65 శాతానికి పెరిగింది. క‌రోనాతో పోరాడుతూ 24 గంటల్లో 23 మంది చ‌నిపోయారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో క‌రోనా యాక్టివ్ కేసులు (active cases) 74,881కి చేరుకున్నాయి. ఢిల్లీలో క‌రోనా కేసుల పెరుద‌ల‌ను ఐఐటీ క‌న్ఫూర్ అంచ‌నా వేసింది. ఓ విశ్లేష‌ణ ఫ‌లితాలను ఇటీవ‌లే వెల్ల‌డించాయి. దీని ప్ర‌కారం ఢిల్లీలో కోవిడ్ థ‌ర్డ్ వేవ్ జ‌న‌వ‌రి 15 నాటికి పీక్ స్టేజ్ కు చేరుకుంటుంది. ఆ స‌మ‌యంలో రోజుకు దాదాపు 70,000 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. త‌రువాత కేసులు త‌గ్గుతాయ‌ని చెప్పింది. 

Latest Videos

undefined

ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తో (ddma) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (cm arvind kejriwal) మంగ‌ళ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు. కొత్త ఆంక్ష‌ల‌ను ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. కోవిడ్ -19 కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ (omicron) త‌క్కువ తీవ్ర‌త‌ను క‌లిగి ఉన్న డెల్టా కంటే వేగంగా వ్యాప్తిస్తోంద‌ని చెప్పారు. అయితే ఢిల్లీ ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందకుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. ఢిల్లీలో లాక్ డౌన్ విధించ‌బోమ‌ని తెలిపారు. లాక్ డౌన్ అమ‌లు చేస్తే ఎంతో మంది జీవ‌నోపాధి దెబ్బ‌తింటుంద‌ని అన్నారు. దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయని, అందులో భాగంగానే ఢిల్లీలో కూడా కేసులు పెరుగుతున్నాయని ఆయ‌న చెప్పారు. అయితే మంగ‌ళ‌వారం ఢిల్లీ డిజాస్గ‌ర్ మేనేజ్ మెంట్ అథారిటీ తో (DDMA) స‌మావేశంలో పాల్గొన్న‌ప్పుడు ఆంక్ష‌లు మొత్తం నేష‌నల్ క్యాపిట‌ల్ రీజియ‌న్ (NCR)  ప‌రిధిలో అమ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరామ‌ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు త‌మ‌కు ఆ విష‌యంలో హామీ ఇచ్చార‌ని అన్నారు. 

ప్రైవేటు ఎంప్లాయిస్ కు వ‌ర్క్ ఫ్రం హోం..
ఢిల్లీలోని అన్ని ప్రైవేట్ ఆఫీసులు (privet office) మూసి వేయాలని మంగ‌ళ‌వారం డీడీఎంఏ (ddma) ఆదేశించింది. ఉద్యోగులందరితో వ‌ర్క్ ఫ్రం హోం (work form home)  విధానంలో ప‌ని చేయించుకోవాల‌ని సూచించింది. అయితే అత్య‌వ‌సర సేవ‌లు అందించే వాటికి మిన‌హాయింపు ఇచ్చింది. కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం రెస్టారెంట్లు (restarents), బార్‌లు (bar) కూడా మూసేశారు. అయితే హోం డెలివ‌రీ (home delivery) , పార్శిల్ సౌక‌ర్యం మాత్రం క‌ల్పించారు. వ‌ర్క్ ఫ్రం హోం నుంచి ప్రైవేట్ బ్యాంకులు (privet banks), ఎమెర్జ‌న్సీ స‌ర్వీసు (emargency service) అందించే ఆఫీసులు, ఇన్సూరెన్స్ కంపెనీలు (insurence company), ఫార్మా కంపెనీలు (farma comany), మైక్రోఫైనాన్స్ కంపెనీలు (micro finance companys), లాయర్ల ఆఫీసులు (lawyers offices), కొరియ‌ర్ స‌ర్వీసులకు (coriar service) మాత్రమే అనుమతి ఇచ్చారు. 
 

click me!