Coronavirus: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్తగా కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య అధికంగా పెరుగుతోంది. అయితే, కరోనా వారియర్స్ సైతం ఎక్కువ సంఖ్యలో వైరస్ కు గురికావడం ఆందోళన కలిగిస్తున్నది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పోలీసు శాఖలో ఏకంగా కరోనా కేసుల పెరుగుదల 150 శాతం నమోదైంది.
Coronavirus: దేశంలో కరోనావైరస్ మరింత ఆందోళనకరంగా వ్యాప్తిచెందుతున్నది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ (Omicron) కేసులు సైతం పెరుగుతూ.. ఆరు వేల మార్కును దాటాయి. సామాన్య ప్రజానీకం నుంచి ప్రజా ప్రతినిధులు, ప్రముఖులకు వరకు ఎవరినీ వదలడం లేదు కరోనా మహమ్మారి. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ (Coronavirus) కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్న కరోనా వారియర్స్ వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, ఫ్రంట్ లైన్ వర్కర్లు అధికంగా కోవిడ్ మహమ్మారి బారినపడటం పెరుగుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది.
దేశంలోనే నమోదవుతున్న కరోనా (Coronavirus) కేసులు అత్యధికం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. దేశ రాజధాని ముంబయిలో మళ్లీ కరోనా కల్లోలం రేపుతున్నది. కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముంబయిలో కొత్తగా కరోనా బారినపడుతున్న పోలీసు సంఖ్య పెరుగుతున్నది. గత మూడు రోజుల వివరాలు గమనిస్తే.. శుక్రవారం నాడు 136 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. గురువారం నాడు 336 మంది పోలీసులకు కరోనా (Coronavirus) సోకింది. బుధవారం నాడు 146 మంది, మంగళవారం నాడు 126 మంది కరోనా సోకింది. ఈ గణాంకాలు గమనిస్తే.. ముంబయిలో కరోనా మహమ్మారి బారినపడుతున్న పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని తెలుస్తన్నది. ముంబయితో పాటు రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడుతున్న పోలీసుల సంఖ్య పెరుతుతున్నది.
undefined
మహారాష్ట్ర మొత్తంగా కరోనా (Coronavirus) బారినపడ్డ పోలీసుల వివరాలు గమనిస్తే... గురువారం 453 కేసులు, బుధవారం 403, మంగళవారం 370 కేసులు నమోదయ్యాయి. వేల మంది పోలీస్ సిబ్బంది కరోనావైరస్ బారినపడి నిర్భంధంలో ఉన్నారు. ఇదిలావుండగా, మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 43,211 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది కరోనా వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 71,24,278కి చేరాయి. కోవిడ్-19 మరణాలు 1,41,756కు పెరిగాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 67,17,125 మంది బయటపడ్డారు. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా యాక్టివ్ కేసులు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం 2,65,397 (Coronavirus) క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం ఒక్క ముంబయిలోనే వెలుగుచూశాయి. గత 24 గంటల్లో ముంబయి నగరంలోనే 11,317 కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో ఒమిక్రాన్ (Omicron) కేసులు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో 238 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1605కి చేరింది. కరోనా వైరస్ కొత్త కేసులు భారీగా నమోదుకావడం.. ఒమిక్రాన్ (Omicron) రోజువారీ కేసులు క్రమంగా పెరగడంపై సర్వ్రతా ఆందోళన వ్యక్తవమవుతున్నది. ఇదిలావుండగా, దేశంలో కరోనా కేసులు నిత్యం రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 2,68,833 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా 402 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా వైరస్ (Coronavirus) కేసుల సంఖ్య 3,68,50,962 చేరగా, మరణాల సంఖ్య 4,85,752కు పెరిగింది.