స్టార్టప్‌‌లు నవ భారతానికి వెన్నెముక.. జనవరి 16ని National Startup Dayగా జరుపుకోవాలి.. ప్రధాని మోదీ

By Sumanth KanukulaFirst Published Jan 15, 2022, 2:02 PM IST
Highlights

స్టార్టప్‌ సంస్థలు నవ భారతానికి వెన్నెముకగా నిలుస్తాయని ప్రధాన మంత్రి Narendra Modi అన్నారు. శనివారం వివిధ రంగాల్లో 150కు పైగా startups  ప్రతినిధులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దేశంలోని ప్రతి జిల్లాలో అంకుర సంస్థలు రావాలని మోదీ ఆకాంక్షించారు. 
 

స్టార్టప్‌ సంస్థలు నవ భారతానికి వెన్నెముకగా నిలుస్తాయని ప్రధాన మంత్రి Narendra Modi అన్నారు. శనివారం వివిధ రంగాల్లో 150కు పైగా startups  ప్రతినిధులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 2022 స్టార్టప్‌లకు కొత్త అవకాశాలు, మార్గాలను తీసుకొచ్చిందని చెప్పారు. స్టార్టప్ విధానాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు సహాయపడటానికి వీలుగా.. జనవరి 16ని జాతీయ అంకుర దినోత్సవంగా జరుపుకుంటామని మోదీ చెప్పారు. భారత దేశం నుంచి భారత దేశం కోసం ఆవిష్కరణలు చేద్దాం అని మోదీ పిలుపునిచ్చారు. 

దేశంలోని ప్రతి జిల్లాలో అంకుర సంస్థలు రావాలని మోదీ ఆకాంక్షించారు. కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తున్న యువతకు మోదీ అభినందనలు తెలిపారు. భారతదేశంలో 42 unicorns( 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ గల స్టార్టప్‌లు)తో పాటుగా 60,000 స్టార్టప్‌లు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. స్టార్టప్‌లు కేవలం ఆవిష్కరణలను తీసుకురావడమే కాకుండా ప్రధాన ఉద్యోగ సృష్టికర్తలుగా కూడా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు .ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడానికి ప్రభుత్వం మూడు అంశాలపై దృష్టి సారిస్తోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 

దేశంలో ప్రారంభించిన ఆవిష్కరణల ద్వారా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ మెరుగుపడుతుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 46వ స్థానంలో ఉందని చెప్పారు.స్టార్టప్‌ల కోసం పాలసీలో భారీ మార్పులు చేస్తున్నట్టుగా చెప్పారు. యువత ఆలోచనలు విశ్వవ్యాప్తంగా ప్రభావితం చేసేలా ఉండాలి. స్వాతంత్ర్య శత దినోత్సవం నాటికి స్టార్టప్‌లదే కీలక పాత్ర అని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇటీవలి సంవత్సరాలలో స్టార్టప్‌ల విజయాలను వివరిస్తూ..  2013-14లో 4,000 పేటెంట్లు ఉండగా, గత సంవత్సరం 28,000 పేటెంట్లు మంజూరు చేయబడ్డాయని మోదీ చెప్పారు. 2013-14లో 70,000 ట్రేడ్‌మార్క్‌ల నమోదు కాగా.. 2020-21లో 2.5 లక్షల ట్రేడ్‌మార్క్‌లు నమోదయ్యాయని తెలిపారు. తొమ్మిది కార్మిక, మూడు పర్యావరణ చట్టాలకు అనుగుణంగా స్వీయ-ధ్రువీకరణ చేయడంతోపాటు నిధులను సులభంగా పొందడం స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి ఇన్నోవేషన్, టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 

భారతదేశంలో 1,000 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు, 11,000 పైగా స్టాండ్ ఎలోన్ ఇన్‌స్టిట్యూట్‌లు, 42,000 పైగా కళాశాలలు, లక్షల పాఠశాలలు ఉన్నాయని కూడా ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ఇవి మన పెట్టుబడి అని.. యువతను ఆవిష్కరింపజేయడానికి ప్రోత్సహించాలని మోదీ చెప్పారు. 

click me!