coronavirus : ఢిల్లీలో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు చేరుకుంది - హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్

By team teluguFirst Published Jan 15, 2022, 1:26 PM IST
Highlights

ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు చేరుకుందని హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ -19 కేసులు తగ్గుతున్నాయని, త్వరలోనే థర్డ్ వేవ్ ముగిసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఢిల్లీలో కరోనా థ‌ర్డ్ వేవ్ (third wave) పీక్ స్టేజ్ కు చేరుకుందని ఆరోగ్య మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ (health minister satyendar jain)  అన్నారు. శనివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కోవిడ్ రోగుల కోసం కేటాయించిన హాస్పిట‌ల్ బెడ్స్ లో ఎక్కువ శాతం ఖాళీగానే ఉన్నాయ‌ని అన్నారు. త్వ‌ర‌లోనే కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయ‌ని అన్నారు. 

దేశ రాజ‌ధాని ఢిల్లీలో శ‌నివారం నాడు కేసుల సంఖ్య 4,000 తగ్గుతుందని ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ అంచ‌నా వేశారు. పాజిటివిటీ రేట్ (positivity rate)  30 శాతంగా ఉంటుంద‌ని తెలిపారు. గ‌త 5-6 రోజులుగా ఆసుపత్రిలో అడ్మిషన్ రేటు పెరగలేద‌ని అన్నారు. దీనిని బ‌ట్టి చూస్తే రాబోయే రోజుల్లో కేసులు తక్కువగా న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. ఢిల్లీలో 85 శాతానికి పైగా హాస్పిటల్ బెడ్‌లు ఖాళీగా ఉన్నాయి అని తెలిపారు. 

ఢిల్లీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 24,383 కోవిడ్-19 (covid -19) కొత్త కేసులు నమోదయ్యాయి. టెస్ట్ పాజిటివిటీ రేటు 30.64 శాతంగా ఉంది. కొత్త కేసుల‌తో క‌లుపుకుంటే ఢిల్లీలో మొత్తం కేసులు 16,70,966కు చేరాయి. క‌రోనా వ‌ల్ల 34 మంది చ‌నిపోయారు. దీంతో క‌రోనా వైర‌స్ కార‌ణండా చ‌నిపోయిన వారి సంఖ్య 25,305కు చేరింది. ప్ర‌స్తుతం ఢిల్లీలో 92,273 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 15,53,388 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా కొత్త కేసులు పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 2.68 లక్షల కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీలో క‌రోనా వైర‌స్ ను క‌ట్ట‌డి చేసేందుకు ఢిల్లీ డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ అథారిటీ  (DDMA) శని, ఆదివారాల్లో కర్ఫ్యూ విధించింది. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మాత్ర‌మే దీని నుంచి మిన‌హాయింపు ఇచ్చింది. మిగితా అన్ని దుకాణాలు జనవరి 16 (ఆదివారం) వరకు మూసివేసి ఉంచుతారు. సోమ‌వారం నాడు వాటిని తిరిగి తెరిచేందుకు అనుమ‌తి ఇచ్చారు. ఈ వీకెండ్ కర్ఫ్యూ (weekend curfew) సమయంలో ప్రజల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి. అయితే విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, అంతర్-రాష్ట్ర బస్ టెర్మినస్‌ల నుంచి వచ్చేవారికి, వెళ్లే వారికి మాత్రం అనుమ‌తి ఉంటుంది. వారు త‌మ వెంట చెల్లుబాటు అయ్యే టికెట్ ఉంచుకోవాల్సి ఉంటుంది. 

మూడు రోజుల కిందట క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా ఢిల్లీ ప్ర‌భుత్వం మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. ప్రైవేట్ ఆఫీసుల‌న్నీ(privet offices) వ‌ర్క్ ఫ్రం హోం (work from home) అమ‌లు చేయాల‌ని సూచించాయి. అయితే కొన్నిఆఫీసులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే కరోనా కేసులు పెరుగుదల మొదలైనప్పటి నుంచి ప్రైవేట్ ఆఫీసులు 50 శాతం సిబ్బందితో ప‌ని చేస్తున్నాయి. కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం కొన్ని ఆఫీసులు మినహా మిగితా అన్ని ఆఫీసులు వ‌ర్క్ ఫ్రం హోం అమ‌లు చేయాల్సి వ‌స్తోంది. దీంతో పాటు రెస్టారెంట్లలో భోజ‌నం చేసే సౌక‌ర్యాన్ని నిలిపివేసింది. కేవ‌లం ఫుడ్ హోం డెలివేరీ (food home delivery), పార్శిల్ (parcel) విధానాన్నే అమలు చేస్తోంది. 

click me!