250 కి.మీలకు రూ. 12 వేలు:యూపీ రవాణ శాఖ నిర్ణయం

By narsimha lodeFirst Published May 14, 2020, 2:08 PM IST
Highlights

250 కి.మీ మధ్య దూరం ప్రయాణం చేయడానికి రూ. 12 వేలు వసూలు చేస్తున్నారు టాక్సీవాలాలు. లాక్ డౌన్ నేపథ్యంలో పబ్లిక్ రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు ముక్కు పిండి ప్రయాణీకుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నాయి.
 


లక్నో:250 కి.మీ మధ్య దూరం ప్రయాణం చేయడానికి రూ. 12 వేలు వసూలు చేస్తున్నారు టాక్సీవాలాలు. లాక్ డౌన్ నేపథ్యంలో పబ్లిక్ రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు ముక్కు పిండి ప్రయాణీకుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నాయి.

ఢిల్లీ ఎయిర్ పోర్టు- నోయిడా-ఘజియాబాద్ మధ్య 250 కి.మీ దూరానికి అత్యధిక చార్జీని వసూలు చేస్తున్నారు. 250 కి.మీ. దూరానికి రూ. 12 వేల ఛార్జీగా నిర్ణయించారు. అంతేకాదు దూరాన్ని బట్టి ప్రతి కిలోమీటరుకు రూ. 50 అదనపు ఛార్జీలను కూడ  వసూలు చేయనున్నారు.

టాక్సీ బుక్ చేసుకోవడానికి కనీస ధరను రూ. 10వేలుగా నిర్ధారించింది  యూపీ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ సంస్థ.ప్రత్యేక ట్యాక్సీతో పాటు బస్సులను కూడ ఆర్టీసీ సంస్థ నడుపుతోంది. నాన్ ఏసీ బస్సుల్లో ఒక్కో సీటుకు రూ. 1000 వసూలు చేస్తోంది. ఏసీ బస్సులకు సీటుకు ఒక్కటికి రూ.1320గా వసూలు చేయనుంది. 

also read:కరోనా దెబ్బ: అడ్వకేట్లు కొన్నాళ్లు నల్లకోటు వాడొద్దన్న సుప్రీంకోర్టు

వంద కి.మీ పరిధిలో మాత్రమే ఈ ఛార్జీలు వసూలు చేస్తారు. వంద కిలోమీటర్లు దాటితే  ప్రయాణీకులకు ఛార్జీలు రెట్టింపు అవుతాయని ఆర్టీసీ ఎండీ రాజశేఖర్ తెలిపారు.నిర్ధేశించిన 100 కి.మీ దాటిన తర్వాత మరో 100 కి.మీ ప్రయాణం చేయాల్సి వస్తే కిలోమీటరకు రూ.40 నుండి రూ.50 వరకు వసూలు చేస్తారు.

ప్రతి బస్సులో 45 మంది ప్రయాణం చేసే వీలుంది. అయితే ఈ బస్సుల్లో కేవలం 26 మందిని మాత్రమే అనుమతిస్తారు. వైరస్ లక్షణాలు లేనివారిని మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉంటున్నందున ఛార్జీలు పెంచినట్టుగా ఆయన చెప్పారు.

click me!