లాక్‌డౌన్ దెబ్బకు రవాణా లేకపోవడంతో ఆంబూరు నుంచి చిత్తూరు జిల్లా పలమనేరుకు కూరగాయాల లారీలో వెళ్లి అక్కడి నుంచి ఓ ప్రైవేటు బ్యాటరీ కంపెనీ లారీలో తిరిగొచ్చేవాడు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. బయటకు వెళితే ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందో అని.. దానిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారు. అయితే.. ఓ వ్యక్తి లాక్ డౌన్ లెక్క చేయకుండా ప్రియురాలి కోసం వెళ్లాడు. చివరకు కరోనా అంటించుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంబూరులో చెప్పుల షాపు నడుపుతున్న యువకుడికి చిత్తూరు గిరింపేటకు చెందిన యువతితో వివాహేతర సంబంధం ఉంది. ఆమె కోసం తరచూ చిత్తూరు జిల్లాకు వస్తుండేవాడు. ఆమెతో సరదాగా గడిపి.. శారీరక సుఖం అనుభవించిన తర్వాతే.. తన ప్రాంతానికి వెళ్లేవాడు.
లాక్‌డౌన్ దెబ్బకు రవాణా లేకపోవడంతో ఆంబూరు నుంచి చిత్తూరు జిల్లా పలమనేరుకు కూరగాయాల లారీలో వెళ్లి అక్కడి నుంచి ఓ ప్రైవేటు బ్యాటరీ కంపెనీ లారీలో తిరిగొచ్చేవాడు.
ఆ యువకుడు వారం రోజుల క్రితం లారీలో వెళుతుండగా చిత్తూరు జిల్లా ఆరోగ్యశాఖాధికారులకు దొరికిపోయాడు. లారీలో తనిఖీ చేసి అందులోని 20 మందిని క్వారంటైన్‌లో పెట్టారు. యువకుడికి వైరస్ నిర్ధారణ కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే తిరుపత్తూరు ఆరోగ్యశాఖాధికారులకు యువకుడికి సంబంధించి సమాచారం ఇచ్చారు.
తమిళనాడు అధికారులు అంబూరులో యువకుడు ఉండే ప్రాంతంలో అలర్ట్ ప్రకటించారు. అతడితో ప్రయాణించిన కూరగాయల వ్యాపారులు, బ్యాటరీ కంపెనీ సిబ్బంది సహా 220 మందికి ఈ నెల 12న రెండు రాష్ట్రాల ఆరోగ్యశాఖ సిబ్బంది వైద్యపరీక్షలు చేశారు. ఈ శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు.