కరోనా దెబ్బ: అడ్వకేట్లు కొన్నాళ్లు నల్లకోటు వాడొద్దన్న సుప్రీంకోర్టు

By narsimha lode  |  First Published May 14, 2020, 11:26 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలోని పలు కోర్టుల్లో వీడియో కాన్పరెన్స్ ద్వారానే కేసులను విచారణ చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు తాజాగా మరో ఆదేశాలు జారీ చేసింది.



న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలోని పలు కోర్టుల్లో వీడియో కాన్పరెన్స్ ద్వారానే కేసులను విచారణ చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు తాజాగా మరో ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలను తీసుకొంటుంది. కరోనా వైరస్ సమసిపోయేవరకు  నలుపు రంగు కోట్లు, గౌన్లు ధరించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రకటించారు.

Latest Videos

ఓ పిల్ ను విచారణ చేసే సమయంలో  చీఫ్ జస్టిస్ ఈ ఆదేశాలు జారీ చేశారు. నలుపు రంగు కోట్లు, గౌన్ల వల్ల కరోనా వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వీటిని ధరించడం నిలిపివేయాలని  లాయర్లను ఉన్నతన్యాయస్థానం కోరింది. దీంతో బుధవారం నాడు జస్టిస్ బోబ్డేతో పాటు ఇతర న్యాయమూర్తులు తెల్లచొక్కాలపై నెక్ బ్యాండ్లను ధరించి విచారణను చేపట్టారు. 

also read:డిస్కంలకు రూ. 90వేల కోట్ల రుణాలు: నిర్మలా సీతారామన్

అయితే భవిష్యత్తులో ఆదేశాలు ఇచ్చేవరకు కూడ ఇదే పద్దతిని కొనసాగించాలని సుప్రీంకోర్టు బుధవారం నాడు ప్రకటించింది. సంప్రదాయ కోట్లు, గౌన్లను ధరించవద్దు, విచారణ సమయంలో న్యాయవాదులు ఎలాంటి డిజైన్లు లేని తెలుపు చొక్కా లేదా సల్వార్ కమీజ్ లేదా తెల్ల చీర తెలుపు రంగు నెక్ బ్యాండ్ ను ధరించాలని ఆ ప్రకటనలో సుప్రీంకోర్టు తెలిపింది.

లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని పలు కోర్టుల్లో ప్రత్యక్షంగా విచారణ సాగడం లేదు. వీడియో కాన్పరెన్స్ ద్వారానే విచారణ సాగుతున్నాయి. 

click me!