Coronavirus: క‌రోనాతో 5,24,903 మంది మృతి.. పెరుగుతున్న యాక్టివ్ కేసులు

Published : Jun 22, 2022, 11:15 AM IST
Coronavirus: క‌రోనాతో 5,24,903 మంది మృతి.. పెరుగుతున్న యాక్టివ్ కేసులు

సారాంశం

Coronavirus: దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పంచుకున్న డేటా ప్రకారం ఢిల్లీలో 1,383 తాజా కోవిడ్ -19 కేసులు 7.22 శాతం పాజిటివ్ రేటుతో నమోదయ్యాయి.   

Covid-19 updates:  దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. భారతదేశంలో గత 24 గంటల్లో మొత్తం 12,249 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇది 23.4% పెరిగింది. దీంతో మొత్తం కోవిడ్‌-19 కేసుల సంఖ్య 4,33,31,645కు పెరిగింది. యాక్టివ్ కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం 81,687 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల‌ను గ‌మ‌నిస్తే.. అత్యధికంగా 3,659 కేసులతో మహారాష్ట్ర టాప్ లో ఉండ‌గా, 2,609 కేసులతో కేరళ, 1,383 కేసులతో ఢిల్లీ, 738 కేసులతో కర్ణాటక, 737 కేసులతో తమిళనాడులో టాప్‌-5 రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. కొత్త కేసులలో 74.5% ఈ ఐదు రాష్ట్రాల నుండి నమోదయ్యాయి. 

29.87% కొత్త కేసులకు మహారాష్ట్ర మాత్రమే కారణమైంది. గత 24 గంటల్లో దేశంలో క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,24,903 కు పెరిగింది. భారతదేశ క‌రోనా రికవరీ రేటు ఇప్పుడు 98.6% వద్ద ఉంది. గత 24 గంటల్లో మొత్తం 9,862 మంది రోగులు కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,27,25,055కి చేరుకుంది. దేశంలో యాక్టివ్ కాసేలోడ్ 81,687గా ఉంది. గత 24 గంటల్లో యాక్టివ్ కేసులు 2,374 పెరిగాయి. ప్ర‌భుత్వం గ‌త‌ 24 గంటల్లో మొత్తం 12,28,291 క‌రోనా డోస్‌లను పంపిణీ చేసింది. దీంతో పంపిణీ చేసిన మొత్తం కోవిడ్‌-19 డోస్‌ల సంఖ్య 1,96,45,99,906కి చేరుకుంది. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప‌రీక్ష‌ల‌ను సైతం పెంచుతున్న‌ట్టు అధికారవ‌ర్గాలు పేర్కొంటున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 3,10,623 నమూనాలను పరీక్షించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. 

 

దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కేసులు, మ‌ర‌ణాలు అధికంగా మ‌హారాష్ట్రలో న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాతి స్థానంలో కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్, హ‌ర్యానాలు ఉన్నాయి. 

 

ఇదిలావుండ‌గా, గుజరాత్‌ ఆరోగ్య మంత్రి రుషికేశ్‌ పటేల్‌ తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని, హోం ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు. సాధారణ లక్షణాలను గమనించిన తర్వాత తాను RT-PCR పరీక్ష చేయించుకున్నానని, అది పాజిటివ్‌గా తేలిందని పటేల్ మంగళవారం రాత్రి ఒక ట్వీట్‌లో తెలిపారు. "నేను ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. నాతో పరిచయం ఉన్న స్నేహితులందరూ జాగ్రత్త వహించాలని నేను కోరుతున్నాను" అని నీటి వనరుల శాఖ బాధ్యతలను కూడా కలిగి ఉన్న పటేల్ అన్నారు. గుజరాత్‌లో ఇటీవలి వారాల్లో రోజువారీ కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?