Prophet row : హిందూ దేవుళ్ల‌పై పరుష పదజాలం వాడే వారినే నేను ప్ర‌శ్నించా - న‌వీన్ జిందాల్

By team teluguFirst Published Jun 22, 2022, 10:26 AM IST
Highlights

హిందూ దేవుళ్లను కించ పరిచే విధంగా మాట్లాడే వారిని మాత్రమే ఉద్దేశించే తాను కామెంట్ చేశానని బీజేపీ మాజీ నేత నవీన్ జిందాల్ మరో సారి స్పష్టం చేశారు. ఎవరి మత మనోభావాలను తక్కువ చేసి మాట్లాడాలనేది తన ఉద్దేశం కాదని అన్నారు. 

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశ వ్యాప్తంగా ఒక్క సారిగా అశాంతిని సృష్టించిన బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ తన కుటుంబంతో కలిసి మధురలోని బంకే బిహారీ ఆలయాన్ని మంగ‌ళ‌వారం సందర్శించారు. ఈ సంద‌ర్భంగా త‌న వ్యాఖ్య‌ల‌పై చెల‌రేగిన వివాదంపై ఆయ‌న స్పందించారు. ‘‘మన హిందూ దేవుళ్ళు, దేవతలపై అసభ్యకరమైన భాషను ఉపయోగించే వ్యక్తులను మాత్రమే నేను ప్రశ్నించాను ’’ అని ఆయ‌న స్థానిక మీడియాతో అన్నారు. 

Agniveers: అగ్నివీరుల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. బీజేపీ నేత కైలాష్‌ విజ‌య‌వ‌ర్గీయ పై కేసు !

ఏ మతానికి చెందిన ప్రజల మతపరమైన మనోభావాలను కించపరచడం లేదా దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని తెలిపారు. ‘‘ దేశంలో శాంతి నెలకొనాలని నేను (బంకే) బిహారీని ప్రార్థించాను. నా ప్రకటనను నేను వెనక్కి తీసుకున్నాను. ఏ మతానికి చెందిన ప్రజల మతపరమైన మనోభావాలను కించపరచడం లేదా దెబ్బతీయడం నా ఉద్దేశం అస్సలు కాదు ’’ అని ఆయ‌న తెలిపారు. హిందూ దేవుళ్ల‌ను కించప‌రుస్తున్న వారిని ఉద్దేశించే తాను మాట్లాడ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సర్వ ధర్మ సంభావ్ ను తాను న‌మ్ముతాన‌ని తెలిపారు. 

అస్సాం కు పయనమైన ఏక్ నాథ్ షిండే, ఎమ్మెల్యేలు.. బీజేపీతో క‌లిసి న‌డ‌వాల‌ని శివసేనకు సూచన

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తనకు ప్రాణహాని ఉందని న‌వీన్ జిందాల్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీంతో త‌న కుటుంబం ఢిల్లీ నుంచి వెళ్లిపోయిందని ఆవేద‌న చెందారు. తన భద్రతపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘‘ నేను బంకే బిహారీ మహారాజ్ పాదాల చెంతకు వచ్చాను. ఇంతకంటే గొప్ప భద్రత ఏముంటుంది ? బెదిరింపుల గురించి నేను ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చాను. దాని పని అది చేసుకుపోతోంది ’’ అని ఆయ‌న అన్నారు. 

Droupadi Murmu Profile: ఇంత‌కీ ద్రౌపది ముర్ము ఎవరు? NDA అధ్యక్ష అభ్యర్థి వివరాలు

బీజేపీ ఢిల్లీ యూనిట్ మీడియా హెడ్ గా ఉన్న జిందాల్ ను జూన్ 5వ తేదీన ఆ పార్టీ బహిష్కరించింది. ఇలాంటి వ్యాఖ్య‌లే చేసి పార్టీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను కూడా స‌స్పెండ్ చేసింది. వీరిద్ద‌రు మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా ఒక్క సారిగా దుమారాన్ని రేపాయి. అనేక ప్రాంతాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. అల్ల‌ర్లు జ‌రిగాయి. వీరి వ్యాఖ్య‌ల‌ను ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కూడా తీవ్రంగా ఖండించారు. అర‌బ్ దేశాలు కూడా భార‌త్ పై తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. ఆయా దేశాల్లో ఉన్న భార‌త రాయ‌బారుల‌ను పిలిపించుకొని ఈ వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ అడిగాయి. దీంతో అవి వారి వ్యక్తిగత వ్యాఖ్య‌ల‌ని, వాటిని పట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని వారు స‌మాధానం ఇచ్చారు. అవి భార‌త్ అభిప్రాయాలు ఏ మాత్రం కావ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌హమ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై చేసిన వ్యాఖ్య‌ల కారణంగా నూపుర్ శ‌ర్మ‌పై దేశంలోని ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లలో కేసులు న‌మోదు అయ్యాయి. 
 

click me!