భారత్‌లో పదికి చేరిన కరోనా మరణాలు: ఏపీలో ఏడో పాజిటివ్ కేసు

By Siva KodatiFirst Published Mar 23, 2020, 9:03 PM IST
Highlights

భారత్‌లో కరోనా మరణాలు పదికి చేరుకున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 69 ఏళ్ల వృద్ధుడు వైరస్ సోకి మరణించాడు. మార్చి 15న అమెరికా నుంచి వచ్చిన ఆ వృద్ధుడు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు.

Also Read:కోల్ కతాలో 55 ఏళ్ల వ్యక్తి మృతి: దేశంలో 9కి చేరిన మృతుల సంఖ్య

ఇవాళ ఒక్కరోజే భారత్‌లో ముగ్గురు మరణించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 55 ఏళ్ల వ్యక్తి మరణించగా.. ముంబైకి చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు కరోనాతో 433 మంది ఆసుపత్రి పాలయ్యారు. అదే సమయంలో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన 25 ఏళ్ల విశాఖ యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 

సోమవారం సాయంత్రం నాటికి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 ధాటికి మరణించిన వారి సంఖ్య 15,189కి చేరింది. ఇందులో యూరప్‌కు చెందిన వారే 9,197 మంది ఉన్నారు. తాజాగా స్పెయిన్‌లో కరోనా తీవ్రత మరింత ఎక్కువైంది.

Also Read:లాక్‌డౌన్‌ అమలుకు తెలంగాణ కఠినచర్యలు: మెడికల్ షాపులు తప్ప.. అన్నీ క్లోజ్

గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 1,395 మంది వైరస్ కారణంగా మరణించగా.. ఇందులో 462 మంది స్పెయిన్ దేశస్తులే ఉన్నారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 2,182కి చేరినట్లు స్పెయిన్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

click me!