కరోనా ఎఫెక్ట్: మహారాష్ట్రలో కర్ఫ్యూ, సరిహద్దుల మూసివేత

By narsimha lodeFirst Published Mar 23, 2020, 6:06 PM IST
Highlights

కరోనా కారణంగా మహారాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను విధిస్తున్నట్టుగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సోమవారం నాడు ప్రకటించారు. మహారాష్ట్రలోని అంతరాష్ట్ర సరిహద్దుల్ని కూడ మూసివేస్తున్నట్టుగా  ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. సోమవారం నుండి కర్ప్యూ అమల్లోకి వస్తోందన్నారు. 


ముంబై: కరోనా కారణంగా మహారాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను విధిస్తున్నట్టుగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సోమవారం నాడు ప్రకటించారు. మహారాష్ట్రలోని అంతరాష్ట్ర సరిహద్దుల్ని కూడ మూసివేస్తున్నట్టుగా  ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. సోమవారం నుండి కర్ప్యూ అమల్లోకి వస్తోందన్నారు. 

అత్యవసర సేవలకు మాత్రమే కర్ఫ్యూ మినహాయింపని ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన ప్రకటించారు.

also read:కరోనా ఎఫెక్ట్: రేపటి నుండి డొమెస్టిక్ విమానాలు రద్దు

నిత్యావసర సరుకులను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం  అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు. ఇవాళ్టికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారి సంఖ్య 415కు చేరుకొంది.

దీంతో  కొన్నిరాష్ట్రాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. లాక్ డౌన్ పై ప్రజలు ఆషామాషీగా  తీసుకోకూడదని ప్రధాని సోమవారం నాడు ట్వీట్ చేశారు. 

click me!