భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేల మైలురాయిని దాటింది. కరోనా వైరస్ తో దేశంలోో ఇప్పటి వరకు 775 మంది మృత్యువాత పడ్డారు. లాక్ డౌన్ లో కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది.
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేలు దాటింది. శనివారం ఉదయం ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 24,506కు చేరుకుంది. మొత్తం 775 మంది కరోనా వైరస్ వ్యాధితో మరణించారు.
దేశంలో కరోనా వైరస్ నుంచి 5062 మంది కోలుకున్నారు. దాంతో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు 18668కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 1429 కేసులు కొత్తగా నమోదు కాగా, 57 మరణాలు రికార్డయ్యాయి.
లాక్ డౌన్ లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. కిరాణా దుకాణాలను తెరవడానికి అనుమతించింది. మాల్స్ మాత్రం మూసే ఉంటాయి. కొన్ని ఆంక్షలతో కిరాణా దుకాణాలను తెరిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. కంటైన్మెంట్ జోన్లకు ఆ సడలింపులు వర్తించవు.
మాస్క్ లు, గ్లౌజులు, సామాజిక దూరం అనివార్యంగా పాటించాలి. దుకాణాల్లో 50 శాతం సిబ్బందిని మాత్రమే అనుమతించాలని సూచించింది.