33 గంటలపాటు లాక్‌డౌన్.. దక్కని ఫలితం: బెంగళూరులో 10 వేలు దాటిన కేసులు

By Siva KodatiFirst Published Jul 7, 2020, 1:08 PM IST
Highlights

కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 33 గంటల లాక్‌డౌన్ ప్రకటించింది. ఇది శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగింది. అయినప్పటికీ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు

భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటికే కేసుల సంఖ్య ప్రపంచంలో మూడో స్థానంలోకి ఎగబాకింది. అయితే దేశ ఆర్ధిక వ్యవస్థకు ఆయువు పట్టు లాంటి నగరాల్లో కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

అనేక రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా నగరాల్లో తిష్ట వేశాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 33 గంటల లాక్‌డౌన్ ప్రకటించింది.

Also Read:కరోనా దెబ్బ: సాయం కోసం 70 కి.మీ సైకిల్‌పై దివ్యాంగుడు

ఇది శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగింది. అయినప్పటికీ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. సోమవారం కర్ణాటకలో కొత్తగా 981 కేసులు వెలుగుచూడటంతో బెంగళూరులో కేసుల సంఖ్య 10 వేల మార్క్‌ను దాటింది.

ప్రస్తుతం నగరంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 10,561 కాగా, ఇందులో 8,860 యాక్టివ్ కేసులున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,843 కేసులు బయటపడగా, 30 మంది మరణించారని సోమవారం సాయంత్రం కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Also Read:ఒక్క రోజులోనే 22,252 కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 7,19,665కి చేరిక

దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 25,317కి చేరింది. ఇందులో 14,385 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 405 మంది కోవిడ్‌తో మరణించగా.. ఒక్క బెంగళూరులోనే 156 మంది ప్రాణాలు కోల్పోయినట్లు  ప్రభుత్వం వెల్లడించింది. 

click me!