సైకిల్ జ్యోతిపై అత్యాచారం, హత్య..? అసలు నిజమిదే

Published : Jul 07, 2020, 12:57 PM IST
సైకిల్ జ్యోతిపై అత్యాచారం, హత్య..? అసలు నిజమిదే

సారాంశం

ఓ మాజీ సైనికాధికారి ఆమెను అత్యాచారం చేసి చంపినట్లు ఓ ఫొటో వైరల్‌గా మారింది. దీనిపై చాలా మంది నెటిజన్లు జ్యోతికి న్యాయం చేయాలంటూ కామెంట్లు పెట్టారు. 

‘సైకిల్ జ్యోతి’ఈ పేరు వినే ఉంటారు. లాక్ డౌన్ సమయంలో తండ్రిని సైకిల్ పై కూర్చోపెట్టి దాదాపు 1200 కిలోమీటర్లు స్వగ్రామానికి చేరింది. ఈ ఘటనతో ఈమె చాలా పాపులర్ అయ్యింది. కాగా... ఆ సైకిల్ జ్యోతిపై ఇటీవల ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని.. ఆ తర్వాత చంపేశాడంటూ వార్తలు వచ్చాయి.

ఆమెకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. బీహార్‌లో దర్భంగలో ఓ మాజీ సైనికాధికారి ఆమెను అత్యాచారం చేసి చంపినట్లు ఓ ఫొటో వైరల్‌గా మారింది. దీనిపై చాలా మంది నెటిజన్లు జ్యోతికి న్యాయం చేయాలంటూ కామెంట్లు పెట్టారు. అయితే ఫాక్ట్‌చెక్‌లో ఈ వార్త అబద్ధమని తెలిసింది.

చనిపోయిన బాధితురాలి పేరు జ్యోతి కుమారి అని ఫాక్ట్‌చెక్‌లో తేలింది. ఆమె విద్యుత్‌ఘాతంతో మరణించినట్లు రిపోర్టులు వెల్లడించగా.. పోస్ట్‌మార్టంలో ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని తెలిసింది.

 కాగా దర్భంగలోని మాజీ సైనికాధికారి ఇంట్లో ఇటీవల ఓ బాలిక మృతదేహం లభ్యమైంది. దీంతో ఆ అధికారితో పాటు ఆయన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ వార్త నేపథ్యంలో ఓ జాతీయ మీడియా సైకిల్‌ జ్యోతిని వాట్సాప్‌లో సంప్రదించగా.. ఆ బాలిక తన రీసెంట్‌ ఫొటోలను వారికి పంపింది. అందులో జ్యోతి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu