గత 24 గంటల్లో దేశంలో 1,334 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్రం ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 15,712కి చేరుకొన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో దేశంలో 1,334 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్రం ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 15,712కి చేరుకొన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు.
ఆదివారం నాడు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.గత 24 గంటల్లో1334 కొత్త కేసులు నమోదు కావడంతో పాటుగా మరో27 మంది మృత్యువాత పడ్డారన్నారు.దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ తో మృతి చెందిన వారి సంఖ్య 507కి చేరుకొందని ఆయన చెప్పారు. కరోనా సోకిన వారిలో 14.19 శాతం మంది కోలుకొన్నారని ఆయన వివరించారు.
undefined
also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: వైద్యం అందక ముంబైలో లాయర్ మృతి
విద్యాసంస్థలు, సినిమాహాల్స్, షాపింగ్ మాల్స్, రాజకీయ పార్టీల సమావేశాలు, సభలు, కల్చరల్ మీటింగ్స్, క్రీడా పోటీల వంటివి మే 3వ తేదీ వరకు నిషేధించనున్నట్టుగా ఆయన తెలిపారు.
దేశంలో 755 ఆసుపత్రులు, 1389 హెల్త్ కేర్ సెంటర్లు కరోనా కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ అభివృద్ది చేస్తున్నామని లవ్ అగర్వాల్ చెప్పారు.
వ్యాక్సిన్ తయారీ కోసం ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ అన్నీ కూడ నిబంధనల ప్రకారంగానే సాగుతున్నాయన్నారు. ఏ రాష్ట్రంలో ఉన్న కూలీలు అదే రాష్ట్రంలో ఉండాలని కేంద్రం ఆదేశించింది. కేంద్రం నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కూడ కూలీలు ప్రయాణించకుండా అవకాశం కల్పించకూడదని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.