భారత్ లో కరోనా కలవరం.. 4,423కు చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య..

By Sairam Indur  |  First Published Jan 4, 2024, 3:27 PM IST

Corona virus : దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోంది. గత కొంత కాలం నుంచి చలనం లేకుండా ఉన్న ఈ కరోనా వైరస్.. ఇటీవల వేగం పుంజుకుంది. అయితే ఈ పరిణామం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


covid - 19 : భారత్ లో కరోనా కలవరం రేకెత్తిస్తోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. గత నెల మొదట్లో రెండంకెల్లోనే నమోదు అయ్యే కేసులు ఇప్పుడు మూడంకెలకు చేరింది. కొత్త కోవిడ్ వేరియటంట్ అయిన జేఎన్.1 ఆవిర్భావం, చల్లని వాతావరణ పరిస్థితుల వల్ల కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్ లో ఒక్క రోజే 760 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. కరోనా వల్ల ఇద్దరు మరణించారు.

Jitendra Awhad : శ్రీరాముడు మాంసాహారి.. వేటాడి తినేవారు.. - ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. (వీడియో)

Latest Videos

2020 ప్రారంభంలో మన దేశంలో ఈ కరోనా మహమ్మారి విజృంభణ మొదలైంది. ఆ సమయంలో రోజు వారీ కొత్త కేసుల సంఖ్య లక్షల్లో నమోదు అయ్యేది. అప్పటి నుండి దేశవ్యాప్తంగా సుమారు నాలుగు సంవత్సరాలలో 4.5 కోట్లకు పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు మరియు 5.3 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.ఇటీవల కేసులు పెరిగినప్పటికీ, భారతదేశంలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది, 4.44 కోట్ల (4,44,75,602) మంది అనారోగ్యం నుండి కోలుకున్నారు. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ లో భాగంగా దేశంలో 220.67 కోట్ల డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను ఇచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇరాన్ లో జంట పేలుళ్లు.. 95 మంది దుర్మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత్

కాగా.. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం, జేఎన్.1 సబ్-వేరియంట్‌ కేసులు వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలను నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించింది. అలాగే, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేస్తోంది.

కాంగ్రెస్‌లో చేరిన వై.ఎస్. షర్మిల: లోటస్ పాండ్‌లో విజయమ్మతో జగన్ భేటీ

అంతేకాకుండా ఈ మార్గదర్శకాలన్నింటినీ ఖచ్చితంగా పాటించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. కేరళలో  ఇద్దరు, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్కరు మరణించారు. 602 కొత్త కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,440 కి పెరిగింది.

click me!