అయోధ్యకు వెళ్లాలనుుంటున్నారా? ఈ యాప్ లో ఇప్పుడే రూం బుక్ చేసుకోండి..

By SumaBala Bukka  |  First Published Jan 4, 2024, 3:16 PM IST

ఈ యాప్‌ని ఉపయోగించి ఏదైనా హోమ్‌స్టేలో గదిని రిజర్వ్ చేసుకోవడానికి ప్రయాణికులు తప్పనిసరిగా ముందుగానే డబ్బులు చెల్లించాలి. వర్కింగ్ లో ఉన్న ఫోన్ నంబర్‌తో రూం రిజర్వేషన్‌ను నిర్ధారించాలి. 


అయోధ్య : పవిత్ర అయోధ్య యాప్ లో అయోధ్య నగరంలోని 500 భవనాలను 'హోమ్‌స్టే'లుగా జాబితా చేసింది. ఇందులో 2200 గదులు పర్యాటకులు యాప్ ద్వారా బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. రూం ఛార్జీలు సగటున రూ. 1000 నుండి ప్రారంభమవుతాయి.రామమందిరాన్ని సందర్శించే పర్యాటకుల కోసం అయోధ్య పరిపాలన 'పవిత్ర అయోధ్య' పేరుతో కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ (ADA) "పవిత్ర అయోధ్య"ని అభివృద్ధి చేసింది. ఇది అయోధ్యలో సరసమైన ధరల్లో హోమ్‌స్టేలను కనుగొనడంలో ప్రయాణికులకు సహాయపడుతుంది.

ప్రస్తుతం, యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇంటర్‌ఫేస్ హోటల్ బుకింగ్ యాప్‌ను పోలి ఉంటుంది కానీ హోటల్ జాబితాలు అయోధ్యకు మాత్రమే ఉంటాయి. రూమ్ ఛార్జీలు సగటున రూ. 1000 నుండి ప్రారంభమవుతాయి."పవిత్ర అయోధ్య" యాప్‌లో హోటల్‌ల వంటి వ్యాపారాల కోసం కాకుండా హోమ్‌స్టేల లిస్టు ఎక్కువగా ఉన్నాయి. అధికారుల ప్రకారం, అయోధ్యలోని 500 మున్సిపల్ భవనాల్లోని 2200 గదులు హోమ్‌స్టేలుగా నమోదు చేయబడ్డాయి. సందర్శకులు ఈ గదులలో బస చేయవచ్చు.

Latest Videos

undefined

ఈ యాప్‌ని ఉపయోగించి ఏదైనా హోమ్‌స్టేలో గదిని రిజర్వ్ చేసుకోవడానికి ప్రయాణికులు తప్పనిసరిగా ముందుగానే డబ్బులు చెల్లించాలి. వర్కింగ్ లో ఉన్న ఫోన్ నంబర్‌తో రూం రిజర్వేషన్‌ను నిర్ధారించాలి. ఒకవేళ రూం రిజర్వేషన్ చేసిన తరవాత క్యాన్సిల్ చేయాల్సి వస్తే.. చెక్-ఇన్ సమయానికి 24 గంటల ముందు రిజర్వేషన్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ తరువాత చేస్తే ఎలాంటి రీఫండ్‌లు ఉండవు.

అయోధ్య రామాలయ ఆహ్వానపత్రం ఎలా ఉందో చూశారా?

24 గంటలకు ముందు క్యాన్సిల్ చేయకపోతే.. ఫ్రీ క్యాన్సిలేషన్, రీఫండ్  ఉండదు. సాధారణంగా చెక్ ఇన్ టైం మధ్యాహ్నం 2. గంటలు. రామ మందిర ప్రారంభోత్సావానికి దాదాపు 8000 మంది ఆహ్వానిత సందర్శకులను స్వాగతించడానికి సన్నాహాల కోసం రోడ్‌మ్యాప్ తయారు చేయబడుతోంది.

జనవరి 22న కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీలు సాఫీగా ప్రయాణం చేయడం కోసం ట్రాఫిక్‌ అంతరాయాలు లేకుండా ఉండేందుకు ప్రత్యేక మార్గం నిర్మించబడుతుంది. వీవీఐపీ మొబిలిటీ సమయంలో, ఈ కారిడార్ అయోధ్యలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వంటి ప్రధాన స్థానాలను కలుపుతూ సాగుతుంది. 

click me!