ఏప్రిల్ 15 నుండి దేశంలో కరోనా విజృంభణ: లవ్ అగర్వాల్

Published : Apr 30, 2021, 04:32 PM IST
ఏప్రిల్ 15 నుండి  దేశంలో కరోనా విజృంభణ: లవ్ అగర్వాల్

సారాంశం

ఏప్రిల్ 15 నుండి దేశంలో కరోనా విజృంభణ పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్  చెప్పారు.   

న్యూఢిల్లీ: ఏప్రిల్ 15 నుండి దేశంలో కరోనా విజృంభణ పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్  చెప్పారు. శుక్రవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర, ఢిల్లీ, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ రాష్ట్రాల్లో కరోనాతో 60 శాతం మంది మరణిస్తున్నారని ఆయన చెప్పారు.  దేశంలో కరోనా చైన్ ను బ్రేక్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ఈ విషయమై రాష్ట్రాలతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నట్టుగా ఆయన  తెలిపారు. ఏ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదౌతున్నాయో ఆ రాష్ట్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సలహాలు, సూచనలు ఇస్తున్నామన్నారు.  అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో వైద్య సౌకర్యాలను పెంచుతున్నామన్నారు. దేశంలో ప్రతి రోజూ కరోనా టెస్టుల సంఖ్య పెంచుతున్నామన్నారు. అంతేకాదు కరోనా కేసుల వ్యాప్తిని నివారించేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్టుగా చెప్పారు. అత్యధికంగా కేసులు నమోదౌతున్న రాష్ట్రాల్లో సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 


 

PREV
click me!

Recommended Stories

Army Training Aircraft Crashes: ప్రమాదానికి గురైన విమానం ఎలా రక్షిస్తున్నారో చూడండి | Asianet Telugu
Sabarimala : బంగారం రాగిగా ఎలా మారింది? శబరిమల గుట్టు రట్టు.. హైకోర్టు చివాట్లు ! ఈడీ పంజా