ఇవాళ కర్ణాటక రాజధాని బెంగళూరులో పదుల సంఖ్యలో బాంబు బెదిరింపులు రావడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. గుర్తు తెలియని ఓ ఈ మెయిల్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పాఠశాలల్లో బాంబులు పెట్టామంటూ మెయిల్‌లో హెచ్చరించడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు.
ఇవాళ కర్ణాటక రాజధాని బెంగళూరులో పదుల సంఖ్యలో బాంబు బెదిరింపులు రావడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. గుర్తు తెలియని ఓ ఈ మెయిల్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పాఠశాలల్లో బాంబులు పెట్టామంటూ మెయిల్‌లో హెచ్చరించడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం తొలుత 7 పాఠశాలలకు బెదిరింపులు రాగా.. తర్వాత 15కు , చివరికి 48 స్కూళ్లకు చేరాయి.
రంగంలోకి దిగిన పోలీసులు, బాంబు స్క్వాడ్ ముందు జాగ్రత్త చర్యగా పిల్లలను, ఉపాధ్యాయులను పాఠశాలల నుంచి బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. బెంగళూరు నగరంలోని కోరమంగళ, వైట్‌ఫీల్డ్, బసవేశ్వర నగర్, యలహంక, సదాశివనగర్‌లలోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. అగంతకులు బెదిరింపులకు పాల్పడిన ఓ స్కూల్.. కేపీసీసీ చీఫ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి అత్యంత సమీపంలో వుండటంతో పోలీసులు పరుగులు పెట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
undefined
ALso Read: Bengaluruలో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు: భయాందోళనలో పేరేంట్స్
డిసెంబర్ 1 శుక్రవారం ఉదయం 10.05 గంటలకు వచ్చిన ఈ మెయిల్ టెక్ట్స్‌లో అభ్యంతరకర భాషతో పాటు హింసాత్మక చర్యలకు సంబంధించిన సమాచారం వుంది. ‘‘పాఠశాల ఆవరణలో పేలుడు పదార్ధాలు వున్నాయి. నవంబర్ 26న అల్లాను అనుసరించే అమరవీరులు వందలాది మంది విగ్రహారాధకులను చంపారు. 10 లక్షల కాఫిర్లపై కత్తి పట్టుకోవడం నిజంగా గొప్పది. వందలాది మంది ముజాహిదీన్లు అల్లా మార్గంలో బలిదానం కోసం ఎదురుచూస్తూ యుద్ధ ప్రాంతాన్ని ముంచెత్తారు. మీరు అల్లాకు శత్రువులు .. మేము మిమ్మల్ని , మీ పిల్లలను చంపుతాము. మా బానిసలుగా మారడానికి లేదా అల్లా ఆలయాల్లోని నిజమైన మతాన్ని అంగీకరించడమే మీకు మార్గం. ’’
‘‘ మీ విగ్రహాలు మా పేలుళ్ల ధాటికి దూరంగా ఎగిరిపడతాయి. అల్లా నిజమైన మతాన్ని భారతదేశం మొత్తం వ్యాప్తింపచేస్తాం. మేము మీ వద్దకు వేటాడే జంతువులను పంపాము . తాజ్ బిస్మిల్లా రేపు రాజధాని అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది జియోనిస్టులు ఇస్లాంలోకి మారతారు లేదా ఇస్లాం కత్తి బరువుకు చనిపోతారు. విశ్వాసులు కాని వారిని కలిసినప్పుడు వారి తలలను , వేళ్లను నరికివేయండి. బహుదైవారాధకులందరితో పోరాడండి అల్లాహో అక్బర్ ’’.
మరోవైపు.. ఈ మెయిల్‌ల విశ్వసనీయతను నిర్ధారించడానికి వాటి మూలాలను అన్వేషించే పనిలో పడ్డారు పోలీసులు. పదుల సంఖ్యలో పాఠశాలలకు బెదిరింపుల నేపథ్యంలో బెంగళూరులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈరోజు పాఠశాలకు తరగతులు రద్దు చేసిన పోలీసులు.. విద్యార్ధులను సురక్షితంగా ఇళ్లకు చేర్చడానికి రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ్టీ ఘటన నేపథ్యంలో ఓ స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఓ ఈ మెయిల్ పంపింది.
‘‘ప్రియమైన తల్లిదండ్రులారా, మా పాఠశాలలో ఈరోజు జరిగిన దురదృష్టకర సంఘటన గురించి మీకు తెలియజేయడానికి రాస్తున్నాం. బెంగళూరులోని మరికొన్ని పాఠశాలల్లోనూ బాంబు బెదిరింపులు వచ్చాయి. ముందు జాగ్రత్త చర్యగా తరలింపు ప్రారంభిస్తున్నాం. ఈ విషయాన్ని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు తెలియజేశారు, వారు కూడా క్యాంపస్ క్లియరెన్స్ నిర్వహిస్తారు. ఇవాళ తరగతులు తిరిగి ప్రారంభించబడవు . విద్యార్ధుల భద్రత, శ్రేయస్సులే మా ప్రాధాన్యతలు. వేగవంతమైన, వ్యవస్థీకృత తరలింపు ప్రక్రియను నిర్వహించడానికి మేము స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నాం.’’ అని సదరు పాఠశాల యాజమాన్యం పేర్కొంది.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులు , సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. మొదట్లో తాను కూడా భయపడ్డానని, ఈ వార్త చూసినప్పుడు ట్రెడ్‌మిల్‌పై వున్నానని.. మా ఇంటి దగ్గరగా వున్న ఓ స్కూల్ పేరు కూడా బ్రేకింగ్‌లో చూపించారని డీకే చెప్పారు.
పాఠశాలలకు వచ్చిన బెదిరింపు మెయిల్‌ను పోలీసులు తనకు చూపించారరని, ప్రస్తుతానికి ఇదంతా ఓ బూటకంలా వుందని, అయినప్పటికీ అప్రమత్తంగా వుండాలని డీకే శివకుమార్ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని డీప్యూటీ సీఎం తెలిపారు. దాదాపు 30 పాఠశాలలకు బెదిరింపు ఈ ఇమెయిల్‌లు వచ్చాయని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. విధ్వంసక నిరోధక బృందాలు ఈ ప్రదేశాలలో ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.