తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వెళ్తున్నందున దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
న్యూఢిల్లీ: తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తుందని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు అల్పపీడనంగా మారింది. ఇది చెన్నైకి ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాత డిసెంబర్ 3వ తేదీన తుఫానుగా మారే అవకాశం ఉంది.
undefined
సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్ లో ఏర్పడే తుఫాన్లు తమిళనాడు, ఒడిశా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీరం దాటుతాయి.
తమిళనాడు తీర ప్రాంతంలో ఇవాళ రాత్రి నుండి రేపు ఉదయం వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తొలుత తమిళనాడులోని డెల్టా జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఈ తుఫాన్ ప్రభావంతో డిసెంబర్ మూడు , నాలుగు తేదీల్లో కేటీసీసీ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తుఫాన్ ల్యాండ్ అయిన తర్వాత ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ ఐదు తర్వాత చెన్నై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ కారణంగా తీర ప్రాంతం వెంబడి నెల్లూరు సమీపంలోని పులికాట్ , మైపాడు మధ్య భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తుఫాన్ ఉత్తర తమిళనాడు ప్రాంతానికి దగ్గర వచ్చినప్పుడు తమిళనాడులోని డెల్టా ప్రాంతాలు, చెన్నైలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.