ముంబయి సెంట్రల్ ప్రిజన్‌లోని ఖైదీకి గంజాయి తీసుకెళ్లుతూ ఓ కానిస్టేబుల్ పట్టుబడ్డాడు. గంజాయిని లోదుస్తుల్లో దాచుకుని డ్యూటీ రిపోర్ట్ చేస్తుండగా పట్టుబడ్డాడు.
ముంబయి: జైలులోని ఖైదీకి గంజాయి తరలిస్తూ ఓ కానిస్టేబుల్ పట్టుబడ్డాడు. ఎనిమిది క్యాప్సుల్స్‌ల నిషేధిత మాదక ద్రవ్యాన్ని లోదుస్తుల్లో దాచి జైలులోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ కానిస్టేబుల్ పై కేసు నమోదైంది. ఆ తర్వాత విధుల్లో నుంచి సదరు ఉద్యోగిని తొలగించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయి సెంట్రల్ ప్రిజన్‌లో చోటుచేసుకుంది.
కానిస్టేబుల్ వివేంద్ర నాయక్ ఖైదీలతో చట్టవిరుద్ధ సంబంధాలు పెట్టుకున్నాడు. ఖైదీకి గంజాయి సరఫరా చేయడానికి అంగీకరించాడు. ఓ రోజు 71 గ్రాముల గంజాయిని డ్రాయర్‌లో దాచుకుని డ్యూటీకి రిపోర్ట్ చేశాడు. డ్యూటీకి రిపోర్ట్ చేస్తుండగానే అతని వద్ద గంజాయి ఉన్నట్టు బయటపడింది.
Also Read: బందీలను విడిచిపెట్టే వరకు గాజాకు తాగు నీరు, విద్యుత్, ఇంధనం బంద్: ఇజ్రాయెల్ వార్నింగ్
జైలులోని ఖైదీకి గంజాయి తరలిస్తూ కానిస్టేబుల్ వివేంద్ర నాయక్ పట్టుబడ్డాడని అధికారులు బుధవారం వెల్లడించారు. ఎన్ఎం జోషి మార్గ్ పోలీసు స్టేషన్‌లో ఆయన పై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఈ ఘటనపై ఏడీజీ ప్రిజన్స్ సీరియస్ అయ్యారు. వెంటనే ఆ కానిస్టేబుల్‌ను విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు.