కూతురిని హత్య చేసిన తండ్రి.. అనంతరం నేరుగా పోలీసు స్టేషన్‌కు.. అసలేం జరిగిందంటే..

ఒక వ్యక్తి తన కన్నకూతరినే దారుణంగా హత్య చేశాడు. అనతంరం నేరుగా పోలీసు స్టేషన్‌‌కు వెళ్లి లొంగిపోయాడు.

Google News Follow Us

ఒక వ్యక్తి తన కన్నకూతరినే దారుణంగా హత్య చేశాడు. అనతంరం నేరుగా పోలీసు స్టేషన్‌‌కు వెళ్లి లొంగిపోయాడు. తన కూతురు వేరే కులానికి చెందిన అబ్బాయితో ప్రేమలో ఉందనే కారణంతో అతడు కలత చెంది.. ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో చోటుచేసుకుంది. వివరాలు.. బెంగళూరు శివార్లలోని దేవనహళ్లి సమీపంలోని బిదలూరు గ్రామానికి చెందిన మంజునాథ్ కూతురు కవన కాలేజ్‌లో చదువుతోంది. ఆమె వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉంది. 

ఈ విషయం తెలుసుకున్న మంజునాథ్ కలత చెందాడు. కూతురు ప్రేమ విషయం, అబ్బాయి వేరే కులానికి చెందినవాడని తెలియడంతో అతడు కోపంతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే ప్రేమ సంబంధం కొనసాగించవద్దని కవనను మంజునాథ్ హెచ్చరించాడు. అయితే కవన తండ్రి మంజునాథ్ మాటను వినిపించుకోలేదు. బుధవారం రాత్రి ఈ విషయమై తండ్రీకూతుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 

ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహంతో మంజునాథ్.. కత్తితో కవన గొంతు కోసి, కాళ్లు, చేతులపై పలుమార్లు పొడిచాడు. దీంతో కవన మరణించింది. అనంతరం విశ్వనాథపుర పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేపట్టారు.