అంతరిక్ష ప్రయోగాలపై కాంగ్రెస్ కీలక ప్రకటన..  తొలి ప్రధానిని గుర్తు చేసుకుంటూ.. 1962 నాటి వార్తకథనం షేర్ ..

Published : Aug 23, 2023, 05:20 PM IST
అంతరిక్ష ప్రయోగాలపై కాంగ్రెస్ కీలక ప్రకటన..  తొలి ప్రధానిని గుర్తు చేసుకుంటూ.. 1962 నాటి వార్తకథనం షేర్ ..

సారాంశం

Chandrayaan-3: చంద్రయాన్ 3 బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం 6.4 గంటలకు చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఈ తరుణంలో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గురించి కాంగ్రెస్ ప్రస్తావిస్తూ.. భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ఫిబ్రవరి 1962లో ప్రారంభమైందని పేర్కొంది.

Chandrayaan-3: భారత అంక్షరిక్ష సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 (Chadrayaan-3) మరికొన్ని గంటల్లో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టనున్నది. ఈ క్షణం కోసం యావత్ భారతావని ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తోంది. దాదాపు 41 రోజుల ప్రయాణం తర్వాత జాబిల్లి ఉపరితలంపై దిగేందుకు విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander) సంసిద్దమైంది. ఈ తరుణంలో కాంగ్రెస్ జైరాం రమేష్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రాం గురించి కీలక ప్రకటన చేశారు. 

ఇదిలా ఉండగా.. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గురించి కాంగ్రెస్ ప్రస్తావిస్తూ.. భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ఫిబ్రవరి 1962లో ప్రారంభమైందని పేర్కొంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. "భారత అంతరిక్ష కార్యక్రమం ఫిబ్రవరి 23, 1962న INCOSPAR (INCOSPAR-ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్)తో ప్రారంభమైంది. దూరదృష్టి గల మాజీ ప్రధాని నెహ్రూ మద్దతుకు హోమీ జహంగీర్ భాభా, విక్రమ్ సారాభాయ్‌లకు ధన్యవాదాలు.ఈ కమిటీలో అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు ఉన్నారు." అని పేర్కొన్నారు. ఈ తరుణంలో 1962లో INCOSPAR ఏర్పాటు వచ్చిన వార్తాకథనాన్ని షేర్ చేశారు. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్‌ అయితే.. చైనా, అమెరికా, పూర్వ సోవియట్ యూనియన్ తర్వాత ఈ ఘనత సాధించిన నాల్గవ దేశంగా భారత్ అవతరించనున్నది. 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!