
BRICS Summit: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలు వచ్చారు. భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జోహన్నెస్‌బర్గ్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీతో ఫోటో దిగడానికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఆసక్తి కనబరిచారు. ఇరునేతలు కలిసి... ఫోటో దిగాడానికి బ్రిక్స్ వేదికపై కాలుమోపారు. అయితే.. ఆ క్షణంలో ఆ వేదికపై పడి ఉన్నా భారత త్రివర్ణ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గమనించారు. మరుక్షణం ఆలోచించకుండా.. వెంటనే అప్రమత్తమయ్యాడు. మరో అడుగు ముందుకు పెట్టకుండా.. ఆ వెంటనే జాతీయ జెండాను గౌరవంతో తీసుకుని తన జేబులో పెట్టుకున్నారు.
ఈ క్రమంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా కింద పడి ఉన్న త్రివర్ణ పతాకాన్ని చూసి.. ఆ వెంటనే తీసుకుని చేతబట్టుకున్నారు. అలా.. మన త్రివర్ణ పతాకాన్ని గౌరవించారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు. ఆ తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌లతో ప్రధాని మోదీ ఫొటోలు దిగారు. బుధవారం జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. అంతకుముందు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.
ప్రధాని మోదీ ట్వీట్
ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేశారు. అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో అద్భుతమైన సమావేశం జరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతదేశం-దక్షిణాఫ్రికా సంబంధాలను మరింతగా బలోపేతం చేసే లక్ష్యంతో మేము అనేక అంశాలపై చర్చించాము. వాణిజ్యం, రక్షణ, పెట్టుబడి సంబంధాలపై ప్రధానంగా చర్చించాం. గ్లోబల్ సౌత్ వాయిస్‌ని బలోపేతం చేయడానికి మేము కలిసి పని చేస్తూనే ఉంటాము. అని ట్వీట్ చేశారు.
భారత్ - చైనాల భేటీ
దక్షిణాఫ్రికాలోని చైనా రాయబారి చెన్ జియాడాంగ్ మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సదస్సులో భారత్, చైనా అగ్రనేతల మధ్య సమావేశం ఉంటుందన్నారు. ఈ భేటీతో సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో.. భారతదేశం నుండి విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల మధ్య సమావేశం ఉందబోతున్నట్టు సూచించారు. అదే సమయంలో భారత్ సానుకూల ఆలోచనతో జోహన్నెస్‌బర్గ్‌కు వెళుతోందని, బ్రిక్స్ విస్తరణ కోసం ఆలోచిస్తోందని చెప్పారు.