రేప్ జరిగితే ఆత్మహత్య చేసుకోవాలి.. కాంగ్రెస్ నాయకుడి సంచలన వ్యాఖ్య, క్షమాపణ

By AN TeluguFirst Published Nov 2, 2020, 10:52 AM IST
Highlights

కాంగ్రెస్ కేరళ యూనిట్ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ ఆదివారం తిరువనంతపురంలో ఓ మీటింగ్ లో మాట్లాడుతూ  రాష్ట్రంలోని అధికార వామపక్ష ప్రభుత్వంపై దారుణమైన, సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఆయన తన వ్యాఖ్యలకు  క్షమాపణలు చెప్పారు. ఓ నాయకుడు ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అని ఆరోగ్య శాఖా మంత్రి కె.కె.శైలాజా విమర్శించారు.

కాంగ్రెస్ కేరళ యూనిట్ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ ఆదివారం తిరువనంతపురంలో ఓ మీటింగ్ లో మాట్లాడుతూ  రాష్ట్రంలోని అధికార వామపక్ష ప్రభుత్వంపై దారుణమైన, సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఆయన తన వ్యాఖ్యలకు  క్షమాపణలు చెప్పారు. ఓ నాయకుడు ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అని ఆరోగ్య శాఖా మంత్రి కె.కె.శైలాజా విమర్శించారు. 

ఓ మహిళ ఒక్కసారి తనపై అత్యాచారం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆత్మగౌరవం ఉన్న మహిళ తనపై అత్యాచారం జరిగితే ఆత్మహత్య చేసుకుంటుంది. లేదా అలా మరోసారి జరగకుండా జాగ్రత్త పడుతుంది అంటూ వ్యాఖ్యానించారు. 

అంతకుముందు ఆరోగ్య మంత్రి కె.కె.శైలాజా మహిళా వ్యతిరేక ప్రకటనలు చేశారని ఆరోపించిన రామచంద్రన్, ప్రతిపక్షాల విమర్శల నుండి దృష్టిని మరల్చడానికి విజయన్ ప్రభుత్వం "బ్లాక్ మెయిల్ రాజకీయాలను" ఆశ్రయిస్తోందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నాయకుడు కొద్దిసేపటికే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.

"ఈ ప్రభుత్వం అవినీతిలో మునిగితేలుతుంది. దాన్నుండి బయటపడే మార్గాలను చూస్తున్నానని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నా ప్రకటన ఎవరైనా వ్యక్తిగతంగా బాధిస్తే హృదయపూర్వక క్షమాపణలు చెబుతాను" అని ఆయన అన్నారు.

కొంతమంది దీన్ని మహిళా వ్యతిరేక వ్యాఖ్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను క్షమాపణ చెప్పిన తరువాత కూడా వివాదం చేయాలని చూస్తే మాత్రం ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశ్యంతో చేస్తుందేనని రామచంద్రన్ అన్నారు. 

"ఒక మహిళపై అత్యాచారం జరిగితే ఆమె ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పడం సిగ్గుచేటు. మహిళలు జాగ్రత్తగా లేపోవడం వల్ల అత్యాచారం జరగదు. ఇది సోషల్ సైకోవల్ల మాత్రమే జరుగుతుంది. దీనికి క్షమాపణ చెప్పడం ఒక్కటే మార్గం కాదు. ఆయన ఇలాంటి ఇలాంటి దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు సిగ్గుచేటని కెకె శైలజ మండిపడ్డారు. 

గత జూన్ లో కోవిడ్ రామచంద్రన్ ఆరోగ్యమంత్రిని కోవిడ్ రాణి అని, నిఫా రాజకుమారి అని అభివర్ణించి చిక్కుల్లో పడ్డాడు. అయితే తాను ఎవ్వర్నీ అవమానించాలని అలా అనలేదని, నేను మాట్లాడింది సరైందని దీనికి నేను క్షమాపణ చెప్పనని అన్నారు. 

click me!