Punjab Assembly Polls: క‌ళాశాల అమ్మాయిల‌కు న‌వ‌జ్యోత్ సింగ్ బంప‌ర్ ఆఫ‌ర్..

Published : Jan 23, 2022, 01:29 PM IST
Punjab Assembly Polls: క‌ళాశాల అమ్మాయిల‌కు న‌వ‌జ్యోత్ సింగ్ బంప‌ర్ ఆఫ‌ర్..

సారాంశం

Punjab Assembly Polls: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పంజాబ్ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి ప్ర‌ధాన పార్టీలు వ‌రాల జ‌ల్లును కురిపిస్తున్నారు. ఈ త‌రుణంలో  కాంగ్రెస్ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. కళాశాల అమ్మాయిలకు బంపర్​ ఆఫర్​ ప్రకటించారు. లూధియానాలో అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ స్కూటర్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు ప్ర‌క‌టించారు.   

Punjab Assembly Polls: ​ అసెంబ్లీ ఎన్నికలు  సమీపిస్తున్న కొద్దీ పంజాబ్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారుతోన్నాయి. ఈ క్ర‌మంలో ఓట‌రు దేవుళ్లును  ఆక‌ర్షించడానికి వ‌రాల జ‌ల్లును కురిపిస్తోన్నారు. ఈ త‌రుణంలో యువతను ఆకట్టుకునేందుకు బంపర్ ఆఫర్​ ప్రకటించారు పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. క‌ళాశాల అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వనున్నట్లు ప్ర‌క‌టించారు.    
 
 కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ.. అమృత్‌సర్‌ ఈస్ట్‌ నుంచి పోటీ చేయ‌నున్నారు.  అయితే ఈసారి సిద్ధూ మజీఠా సీటులో బిక్రమ్‌ మజీఠియాపై లేదా పాటియాలా స్థానంలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌పై పోటీ చేస్తారని ముందుగా ఊహించారు.  

ప్ర‌చారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే అంశాలపై ప్ర‌తిప‌క్షాలు దృష్టిపెట్టవని అన్నారు. రాష్ట్ర​ ఆర్థికాభివృద్ధి దృష్ట్యా.. 'పంజాబ్ మోడల్​'లో భాగంగా.. లూధియానాను పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

 లూధియానాతో పాటు మొహాలీని IT హబ్​గా, కపుర్తలా- బటాలాను ఫౌండ్రీ క్లస్టర్​గా, పటియాలాను ఫుడ్​ ప్రాసెసింగ్ హబ్​గా, అమృత్​సర్​ను మెడికల్ అండ్ టూరిజం హబ్​గా, మలౌట్, ముక్త్​సర్​ను వస్త్ర పరిశ్రమ, వ్యవసాయ రంగ ఉత్పత్తుల క్లస్టర్​గా మారుస్తామని చెప్పుకొచ్చారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను రాష్ట్రానికి ఆహ్వానిస్తానని, లూథియానాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమను సృష్టిస్తానని నవజ్యోత్ సింగ్ సిద్ధూ  తెలిపారు. పంజాబ్ మోడల్ 10 పారిశ్రామిక మరియు 13 ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్‌లను ఏర్పాటు చేబోతున్నామ‌ని తెలిపారు.  

 రానున్న ఎన్నికల్లో ఉపాధి అత్యంత కీలకమని సిద్ధూ అన్నారు. రాష్ట్రంలో నైపుణ్యం-ఆధారిత వ్యవస్థాపకతను సృష్టిస్తామని,  పంజాబ్‌ మోడల్‌ మన్మోహన్‌ సింగ్‌ అభివృద్దికి స్పూర్తిగా నిలుస్తుందని ఆయన అన్నారు. పంజాబ్‌లో తొలిదశ పోలింగ్ ఫిబ్రవరి 20న  జరగనున్నాయి.

పరిశ్రమలకు ఆదర్శవంతమైన వాతావరణాన్ని అందించడానికి, పారిశ్రామిక యూనిట్లు దేశంలో ఎక్కడి నుండైనా చౌకగా విద్యుత్‌ను కొనుగోలు చేసే స్వేచ్ఛను కలిగి ఉంటాయని తెలిపారు. అలాగే  పరిశ్రమల వ్యవహారాలను  చ‌ర్చించ‌డానికి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని పంజాబ్ లో ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని తెలిపారు.  
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?