దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ‘భారత్ జోడో యాత్ర’.. కాంగ్రెస్ ప్లాన్

Published : Sep 03, 2023, 05:40 PM IST
దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ‘భారత్ జోడో యాత్ర’.. కాంగ్రెస్ ప్లాన్

సారాంశం

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలు చేపట్టనుంది. భారత్ జోడో యాత్ర ప్రారంభమై ఏడాది గడుస్తున్న సందర్భంలో దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిల్లో యాత్రలు చేపట్టాలని ఆలోచనలు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు కావాల్సి ఉన్నది.  

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతమైన సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారి నుంచి ఈ యాత్ర మొదలు పెట్టిన రాహుల్ గాంధీ 145 రోజుల్లో సుమారు 4,000 కిలోమీటర్ల యాత్ర చేశారు. చివరకు కశ్మీర్‌లో ఈ ఏడాది జనవరిలో కశ్మీర్ యాత్ర ముగించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభించారు. భారత్ జోడో యాత్ర ప్రారంభమై ఏడాది గడుస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యాత్రలు చేపట్టాలని ఆలోచనలు చేస్తున్నదని పార్టీ వర్గాలు తెలిపాయి.

భారత్ జోడో యాత్ర మొదలై ఏడాది గడుస్తున్న సందర్భంగా జిల్లా స్థాయిలో యాత్రలు చేపట్టాలని ఆలోచనలు చేస్తున్నది. అయితే.. ఇందుకు ఏ విధానాలు పాటించాలని, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎంత దూరం యాత్ర సాగాలనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే సమగ్ర నిర్ణయాలు ఖరారు కానున్నాయి.

Also Read: జమిలి ఎన్నికలతో సామాన్యులకు ఒరిగేదేమిటీ? ‘వన్ నేషన్, వన్ ఎడ్యుకేషన్’ బెటర్: కేజ్రీవాల్

శ్రీనగర్‌లోని షేర్ ఈ కాశ్మీర్ క్రికెట్ స్టేడియంలో చివరి సభను నిర్వహించినప్పుడు భారత్ జోడో గురించి రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ యాత్ర తన కోసమో.. కాంగ్రెస్ పార్టీ కోసమో చేపట్టలేదని వివరించారు. దేశ పునాదులను నాశనం చేస్తున్న భావజాలానికి వ్యతిరేకంగా నిలబడటమే తమ లక్ష్యం అని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?