కశ్మీర్, అరుణాచల్‌లో జీ20 కార్యక్రమాలపై చైనా అభ్యంతరం.. కొట్టిపారేసిన పీఎం మోడీ

Published : Sep 03, 2023, 04:27 PM IST
కశ్మీర్, అరుణాచల్‌లో జీ20 కార్యక్రమాలపై చైనా అభ్యంతరం.. కొట్టిపారేసిన పీఎం మోడీ

సారాంశం

కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో జీ 20 సమావేశాలు జరపడం పాకిస్తాన, అరుణాచల్ ప్రదేశ్‌లు అభ్యంతరం తెలిపాయి. ఈ అభ్యంతరాలను ఇది వరకే భారత్ కొట్టిపారేసింది. అయితే.. గతవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ కూడా తోసిపుచ్చారు.  

న్యూఢిల్లీ: జీ 20 సమావేశాలను దేశంలోని ప్రతి చోటా నిర్వహించాలని భావించడం సహజమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో ఈ సమావేశాలు నిర్వహించడంపై జీ 20 సభ్య దేశం చైనా, దాయాది దేశం పాకిస్తాన్ గతంలో అభ్యంతరం తెలిపాయి. ఈ అభ్యంతరాలపై ప్రధాని మోడీ స్పందించారు. వాటి అభ్యంతరాలను కొట్టిపారేశారు. దేశంలోని ప్రతి మూలన సమావేశాలు ఏర్పాటు చేసే హక్కు, అధికారం మనదే అని స్పష్టం చేశారు. భారత సంస్కృతి, వైవిధ్యతను ప్రపంచ యవనిక మీద చూపించే కృషి చేయడం సహజమే అని వివరించారు. దేశంలోని నలుములల్లో జీ 20 కార్యక్రమాలను  కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది.

కశ్మీర్ వివాదాస్పద ప్రాంతం అని, కాబట్టి, ఇక్కడ జీ20 కార్యక్రమాలు నిర్వహించవద్దని చైనా, పాకిస్తాన్ అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటికే భారత్ ఆ అభ్యంతరాలను తోసిపుచ్చింది. తాజాగా, పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.

‘కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో మేం కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించకుంటే అలాంటి ప్రశ్నకు విలువ ఉంటుంది. మన దేశం సుందరమైనది. వైవిధ్యభరితమైనది. అలాంటి చోట జీ 20 సమావేశాలు జరిగినప్పుడు దేశంలోని అన్ని చోట్ల జరుగుతాయి. ఇది సహజం’ అని ప్రధాని మోడీ గత వారం అన్నారు.

Also Read: కర్ణాటకలో ఆపరేషన్ లోటస్? మాజీ మంత్రి హాట్ కామెంట్స్

జీ20 మూడో వర్కింగ్ గ్రూప్ మీటింగ్ టూరిజం పైన మే 22 నుంచి మూడు రోజులపాటు శ్రీనగర్‌లో సమావేశమైంది. జీ 20 దేశఆల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒక్క చైనా ప్రతినిధి మాత్రమే పాల్గొనలేదు. అంతేకాదు, జీ 20 కార్యక్రమంలో భాగంగానే పెద్ద సంఖ్యలో ప్రతినిధులు మార్చి నెలలో అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు