తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే దీనిపై వ్యతిరేకత వచ్చింది. దీంతో తమ పార్టీకి బజరంగ్ దళ్ ను నిషేధించే ప్రతిపాదన ఏదీ లేదని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ప్రకటించారు.
బజరంగ్ దళ్ ను నిషేధించే ప్రతిపాదనేది కాంగ్రెస్ కు లేదని ఆ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ తెలిపారు. ఓ కాంగ్రెస్ నేతగా తాను ఈ విషయం స్పష్టం గా చెప్పగలనని అన్నారు. కర్ణాటక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్ 2న విడుదల చేసిన మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చిన రెండు రోజుల తర్వాత మొయిలీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
హింసాత్మక ఘర్షణలతో మండిపోతున్న మణిపూర్.. సాయం చేయాలంటూ మేరీ కోమ్ ట్వీట్.. అసలేం జరుగుతోందంటే ?
పార్టీ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని ఇచ్చిన హామీపై కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో మెయిలీ ఈ ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. ఈ విషయంలో కర్ణాటకలో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రాముడిని కాంగ్రెస్ పార్టీ బంధించిందని, హనుమంతుడి భక్తులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.
to ban says former CM Veerappa Moily. The state govt doesn't have the power to ban PFI or bajarang dal, DK shivkumar will give clarity on the same, the proposal was never with us in centre or state, we have gone by the supreme court to stop hate politics. pic.twitter.com/X2jylRy7iv
— Imran Khan (@KeypadGuerilla)‘‘చట్టం, రాజ్యాంగం పవిత్రమైనవని, బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలు మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం, విద్వేషాలను ప్రోత్సహించే వ్యక్తులు ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించరాదని మేము నమ్ముతాం. అలాంటి సంస్థలపై నిషేధం విధించడంతో పాటు చట్టం ప్రకారం మేము నిర్ణయాత్మక చర్య తీసుకుంటాము. ’’ అని కాంగ్రెస్ తన మేనిఫిస్టో విడుదల సందర్భంగా పేర్కొంది. అయితే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో బజరంగ్ దళ్ ను కాంగ్రెస్ పోల్చడంపై బీజేపీ మండిపడింది.
ఘోరం.. రూ. 8 వేలు దొంగలించారనే అనుమానంతో కాలేజీ విద్యార్థినుల బట్టలు విప్పించిన హాస్టల్ వార్డెన్..
కాగా.. ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ సంస్థను నిషేధిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీకి నిరసనగా కర్ణాటక అంతటా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ ఎన్నికల హామీపై వీహెచ్ పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ స్పందిచారు. తమ సంస్థ దీనిని సవాలుగా తీసుకుందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ పార్టీకి సమాధానం ఇస్తుందని చెప్పారు. కర్ణాటక ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేసేటప్పుడు, జాతీయవాద సంస్థ అయిన భజరంగ్ దళ్ ను దేశ వ్యతిరేక, ఉగ్రవాద, నిషేధిత సంస్థ అయిన పీఎఫ్ఐతో కాంగ్రెస్ పోల్చిన తీరు దురదృష్టకరమని ఆయన అన్నారు.