
జమ్మూ కాశ్మీర్‌లో గురువారం ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. కిష్త్వార్ జిల్లా మార్వా తహసీల్‌లోని మచ్చ్నా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆర్మీ అధికారుల ప్రకారం.. హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్లకు గాయాలయ్యాయి. అయితే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని, మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నామని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
‘‘ఆర్మీ ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ సమీపంలో కుప్పకూలింది. పైలట్లకు గాయాలయ్యాయి. అయితే వారు సురక్షితంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’’ అని ఆర్మీ అధికారులు తెలిపారు.