కాంగ్రెస్‌కి జంపింగ్‌ల షాక్, లాభపడింది బీజేపీ: ఏడో స్థానంలో టీడీపీ, ఐదో స్థానంలో వైసీపీ

By narsimha lodeFirst Published Sep 10, 2021, 1:37 PM IST
Highlights

2014 నుండి 2021 వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులపై ఏడీఆర్ నివేదిక విడుదల చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నేతలు, ప్రజా ప్రతినిధులు పార్టీలు మారినట్టుగా ఆ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఈ ఫిరాయింపులతో నష్టపోయిందని  తేలింది.


న్యూఢిల్లీ: 2014 నుండి ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపులతో దేశంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్( ఏడీఆర్) నివేదిక తేల్చి చెప్పింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో 1,633 మంది ప్రజా ప్రతినిధులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని  ఆ నివేదిక తేల్చి చెప్పింది.

కాంగ్రెస్ పార్టీ నుండి 399 మంది ప్రజా ప్రతినిధులు ఇతర పార్టీల్లో చేరారు. బీజేపీలో ఇతర పార్టీల నుండి 426 మంది చేరినట్టుగా ఏడీఆర్ నివేదిక తేల్చి చెప్పింది. సీఆర్‌పీసీ సెక్షన్ 321 ని దుర్వినియోగం చేసి కొందరు నేతలపై ఉన్న ప్రాసిక్యూషన్ ను ఉపసంహరించుకోవడం వలసలకు కారణమైందని ఏడీఆర్ నివేదిక తేల్చి చెప్పింది.

కాంగ్రెస్ పార్టీ నుండి 222 మంది నేతలు, 177 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరారు. ఇతర పార్టీల నుండి  253 మంది నేతలు,  173 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని ఆ నివేదిక స్పష్టం చేసింది.61 మంది నేతలు టీఎంసీలో చేరారు.

ఇక టీడీపీకి చెందిన నేతలు కూడ ఆ పార్టీని వీడారు.  ఆ పార్టీకి చెందిన 32 మంది అభ్యర్ధులు, 26 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడినట్టుగా ఏడీఆర్ తెలిపింది. ఇతర పార్టీల నుండి 16 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు.177 మంది ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నుండి, బీజేపీ నుండి 33 మంది, టీడీపీ నుండి 26 మంది వీడినట్టుగా  ఈ నివేదిక తెలిపింది. పార్టీ పిరాయింపుల విషయంలో టీడీపీ దేశంలో ఏడో స్థానంలో నిలిచింది

వైసీపీ నుండి ముగ్గురు అభ్యర్ధులు, 16 మంది ఎంపీీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఇతర పార్టీల నుండి 36 మంది అభ్యర్ధులు, 24 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారని ఏడీఆర్ నివేదిక వివరించింది. ఫిరాయింపుల విషయంలో వైసీపీ దేశంలో ఐదో స్థానాన్ని దక్కించుకొంది.

టీఆర్ఎస్ నుండి నలుగురు అభ్యర్ధులు, నలుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడారు. ఇతర పార్టీల నుండి 12 మంది అభ్యర్ధులు, 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుకొన్నారు. జనసేనలో ఇతర పార్టీల నుండి నలుగురు అభ్యర్ధులు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరారని ఏడీఆర్ రిపోర్టు చెబుతోంది.

click me!