డ్రస్ మార్చుకుంటే వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేసి...

Published : Sep 10, 2021, 11:02 AM IST
డ్రస్ మార్చుకుంటే వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేసి...

సారాంశం

ఈ క్రమంలో మంగళవారం ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేసి అతడి వద్దకు పిలుపించుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఓ మహిళా ఉద్యోగిని డ్రెస్ మార్చుకుంటుండగా... ఎవరో వీడియో తీశారు. అనంతరం.. ఆ వీడియో చూపించి సదరు యువతిని బ్లాక్ మొయిల్ చేశారు.. ఆ వీడియో చూపించి ఆమెపై అత్యాచారానికి కూడా పాల్పడటం గమనార్హం. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. బలవంతంగా అబార్షన్ కూడా చేయించారు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గురుగ్రామ్‌ సెక్టార్‌ 52లో ఉన్న ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా ఓ యువతి (26) పని చేస్తోంది. అయితే ల్యాబ్‌లో పని చేసేప్పుడు డ్రెస్‌ వేరే (యూనిఫార్మ్‌) ఉంటుంది. ఉద్యోగానికి వచ్చేప్పుడు.. వెళ్లేప్పుడు డ్రెస్‌ మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒకరోజు యధావిధిగా ఆమె డ్రెస్‌ మార్చుకుంటోంది. 

ఆమెతో పాటు ఒకప్పుడు ల్యాబ్‌లో పని చేసిన యువకుడు సచిన్‌ సింగ్‌ తివారీ. ఒకరోజు ఆమె డ్రెస్‌ మార్చుకుంటుండగా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను యువతికి చూపించి వేధించసాగాడు. ఈ క్రమంలో మంగళవారం ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేసి అతడి వద్దకు పిలుపించుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

తాజాగా మంగళవారం ‘మాట్లాడుదాం రా’ అని అతడు తన స్వగ్రామం వాజిరబాకు పిలిపించుకున్నాడు. ఆమె రాగానే కారులోకి ఎక్కించుకుని బాద్షాపూర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి బలాత్కారం చేయబోగా యువతి అడ్డగించింది. అయితే కత్తి చూపెట్టి భయపెట్టాడు. కారులోనే ఆమెను బలవంతంగా దాడి చేస్తుండడంతో యువతి అరిచింది. ఆమె కేకలు విన్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. 

ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. పోలీసులకు ఆమె అతడి దారుణాలను వివరించింది. గతంలో అనేకసార్లు బ్లాక్‌ మెయిల్‌ చేసి లోబర్చుకున్నాడని వాపోయింది. గర్భం దాలిస్తే తీయించి వేశాడని కన్నీటి పర్యంతమైంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu