
లక్నో:హైద్రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మతసామరస్యానికి విఘాతం కలిగేలా వ్యాఖ్యలు చేశారని అసద్‌పై పోలీసులు కేసు పెట్టారు.ప్రధాని మోడీ సహా, యూపీ సీఎం యోగి పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు కరోనా నిబంధనలు ఉల్లంఘించిన ఘటనపై కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు.ఎంఐఎం చీఫ్ పై గురువారం నాడు రాత్రి బారాబంకి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినట్టుగా బారాబంకి ఎస్పీ యమునా ప్రసాద్ చెప్పారు.యూపీ రాష్ట్రంలోని కాట్రచందనలో జరిగిన పార్టీ ర్యాలీలో కరోనా నిబంధనలను కూడ పాటించలేదని ఎస్పీ తెలిపారు.మత సామరస్యానికి విఘాతం కలిగేలా ఎంఐఎం చీఫ్ వ్యాఖ్యలు చేశారని ఎస్పీ గుర్తు చేశారు. 100 ఏళ్ల నాటి రామ్ సనేహి ఘాట్ మసీదును ధ్వంసం చేశా
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 100 అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయాలని భావిస్తోంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా చట్టాన్ని ప్రస్తావిస్తూ హిందూ మహిళల దుస్తితి గురించి చెబుతూ మోడీపై దూషణలకు దిగారని ఎస్పీ చెప్పారు.లౌకికవాదాన్ని కూల్చివేసి దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మోడీపై మండిపడ్డారు.