తొందరపడకు మిత్రమా.. కూల్ డౌన్: కేంద్రమంత్రి జైశంకర్‌పై శశిథరూర్ కామెంట్లు

By Mahesh K  |  First Published Apr 3, 2023, 6:44 PM IST

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పై కాంగ్రెస్ నేత శశిథరూర్ రియాక్ట్ అయ్యారు. తొండరపడరాదని ఆయన సూచనలు చేశారు. ప్రతి కామెంట్‌కూ రియాక్ట్ కావాల్సిన పని లేదని వివరించారు.
 


న్యూఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఎంపీ శశిథరూర్ సోమవారం కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పై కామెంట్లు చేశారు. పాశ్చాత్య దేశాలకు ఇతర దేశాలపై నోరుపారేసుకున్న దురలవాటు ఉన్నదని జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై థరూర్ స్పందిస్తూ తొందరపడకు అని సూచనలు చేశారు. కొంచెం కూల్ కావాలని అన్నారు. ప్రతిదానికి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని వివరించారు. కొన్ని దీర్ఘకాలిక వ్యూహాలు రచించడాన్ని నేర్చుకోవాలని సూచించారు.

‘జైశంకర్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయనను ఒక మిత్రుడిగా భావిస్తాను. కానీ, ఈ అంశంపై మనం ప్రతిసారి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని చెబుతాను. ప్రభుత్వంగా మనం దీర్ఘకాలిక ఆలోచనలు చేయాలి. ప్రతి దానికి కామెంట్ చేస్తే మనల్ని మనం నష్టపరుచుకున్నవాళ్లం అవుతాం’ అని థరూర్ అన్నారు.

Latest Videos

‘నా మిత్రుడు జైశంకర్‌ను కూల్ కావాలని చెబుతా’ అని వివరించారు.

బెంగళూరులో 500 మంది యువత, జాగర్లు, సందర్శకులతో ఎస్ జైశంకర్ ఆదివారం రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా పాశ్చాత్య దేశాలపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన తర్వాత అమెరికా, జర్మనీలు చేసిన కామెంట్ల గురించి ప్రస్తావించగా.. జైశంకర్ ఇలా సమాధానం ఇచ్చారు. ‘అవి స్పందించడానికి రెండు కారణాలు ఉన్నాయి. పాశ్చాత్య దేశాలకు ఇతర దేశాల వ్యవహారాలపై కామెంట్ చేసే దురలవాటు ఉన్నది. ఇలా వ్యాఖ్యలు చేయడం ఆ దేశాలకు దేవుడు ఇచ్చిన హక్కుగా భావిస్తుంటాయి. అవి ఇలాగే కామెంట్ చేస్తూ ఉంటే మిగితా దేశాలు కూడా వాటిపై వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందనేది వాటికి అనుభవం ద్వారా తెలిసి వస్తుంది. ఇలా జరగడాన్ని నేను చూస్తున్నాను’ అని జైశంకర్ అన్నారు.

Also Read: సత్యమే నా ఆయుధం: గుజరాత్ కోర్టులో ఉపశమనం తర్వాత రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదే

‘ఇక రెండోది, మన ఆర్గ్యుమెంట్ పెట్టుకుని వారికి అవకాశం ఇవ్వరాదు. భారత్‌లో సమస్యల గురించి అమెరికా, యూరప్ దేశాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని మనమే వాటి దగ్గరకు వెళ్లి అడగరాదు. అలా అడిగినప్పుడు అవి కామెంట్ చేస్తాయి’ అని పరోక్షంగా రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు.

click me!