రాజీనామాపై రమ్య ఏమన్నారంటే..

By ramya neerukondaFirst Published Oct 3, 2018, 4:52 PM IST
Highlights

సినీనటి రమ్య(దివ్య స్పందన) తన పదవికి రాజీనామా చేసినట్లు  ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే

కాంగ్రెస్ పార్టీ మహిళా నేత,  సినీనటి రమ్య(దివ్య స్పందన) తన పదవికి రాజీనామా చేసినట్లు  ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై రమ్య  స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం సెలవుపై ఉన్న తాను తిరిగి గురువారం ఆఫీసు విధుల్లో పాల్గొంటానని చెప్పారు.
 
దివ్య ట్విట్టర్ పేజీ ప్రొఫైల్‌లో కాంగ్రెస్‌తో ఆమెకున్న అనుబంధం గురించి ఏమీ లేకపోవడంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారన్న ఊహాగానాలు చెలరేగాయి. రాఫెల్ ఆరోపణలపై మోదీ స్పందించకపోవడాన్ని ఇటీవల ఓ ట్వీట్‌లో విమర్శించిన దివ్య స్పందన...మోదీని 'చోర్' అంటూ ఆయన ఫోటోను కూడా ట్వీట్ చేశారు. దీంతో ఆమెపై లక్నోకు చెందిన ఒకరు 'దేశద్రోహం' కేసు వేశారు. ఈ నేపథ్యంలో దివ్య ట్విట్టర్ ప్రొఫైల్‌లో చోటుచేసుకున్న మార్పు ఆమె రాజీనామా చేశారన్న ఊహాగానాలకు తావిచ్చింది. దీనిపై దివ్యస్పందన వివరణ ఇస్తూ, తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో బగ్ (సాంకేతిక లోపం) కారణంగానే ఈ సమస్య తలెత్తిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ మహిళా నేత,  సినీనటి రమ్య(దివ్య స్పందన) తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆమె కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చీఫ్ గా వ్యవహరించేవారు. కాగా.. ఇప్పుడు ఆ పదవికి ఆమె రాజీనామా చేసినట్లు సమాచారం.అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని, పార్టీలో వేరే పదవి ఆమెకు కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.
 
ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను అభ్యంతరకరమైన రీతిలో ట్వీట్‌ చేసినందుకు దివ్య స్పందనపై 'దేశద్రోహం' కేసు నమోదైంది. వివాదాస్పద రఫేల్ ఒప్పందంపై వచ్చిన ఆరోపణలకు మోదీ స్పందించడం లేదని ఓ ట్వీట్‌లో ఆమె ప్రశ్నించడంతో పాటు మోదీని 'దొంగ'గా అభివర్ణించారు. ఓ ఫోటోను కూడా ట్వీట్‌కు జోడించారు. దీంతో లక్నోకి చెందిన లాయర్ సైయద్ రిజ్వార్ అహ్మద్ ఆమెపై ఫిర్యాదు చేశారు. దివ్యస్పందన ట్వీట్ పరువుదిగజార్చేలా ఉందని, దేశ సార్వభౌమాధికారం, రిపబ్లిక్‌కు ప్రధాని ప్రతినిధి అని, ఆమె స్పందన దేశ ప్రతిష్టను దిగజార్చడమే గాకుండా, దేశ ధిక్కారం కిందకు వస్తుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు 

కాంగ్రెస్ నేత సినీనటి రమ్యపై రాజద్రోహం కేసు

మోదీ ట్వీట్ ఎఫెక్ట్.. రమ్య రాజీనామా..?

 

click me!