మద్యం మత్తులో అమ్మాయిల వీరంగం....పోలీసులపైనే దాడి

Published : Oct 03, 2018, 03:23 PM IST
మద్యం మత్తులో అమ్మాయిల వీరంగం....పోలీసులపైనే దాడి

సారాంశం

ఫుల్లుగా మందుకొట్టి ఆ మత్తులో నలుగురు అమ్మాయిలు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. రాత్రి 2 గంటల సమయంలో వీధిలోకి వచ్చి ఒకరితో ఒకరు గొవడకు దిగుతూ అసభ్యంగా  ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా సముదాయించడాని ప్రయత్నించిన పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు.ఈ  ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది.

ముంబై నగరంలోని భయాండర్ ప్రాంతంలో కొందరు అమ్మాయిలు ఓ క్రీడా మైదానంలో హల్ చల్ చేశారు. వాళ్లలో వారే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ గందరగోళం సృష్టించారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి తన సిబ్బందితో కలిసి చేరుకున్న ఎఎస్సై మనీషా పాటిల్ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.

పోలీసులను కూడా లెక్కచేయకుండా వారిపైనే దాడికి దిగారు. వారి వద్ద లాఠీలు లాక్కుని దాడికి ప్రతయ్నించారు. పోలీసులను అసభ్యంగా తిడుతూ హంగామాను కొనసాగించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో ఓ యువతి పోలీసుల నుండి తప్పించుకుని పారిపోయింది. 

 మిగతా ముగ్గురు ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్నారు. పట్టుబడిన అమ్మాయిలు మమతా మెహార్(25), అలీషా పిళ్లె(23), కమల్ శ్రీవాత్సవ(22), జెస్సీ డీ కోస్టా(22)లుగా గుర్తించారు.  వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..