Rahul Gandhi: 'మాది పేదల ప్రభుత్వం.. అదానీల ప్రభుత్వం కాదు..'

Published : Sep 02, 2023, 08:55 PM IST
Rahul Gandhi: 'మాది పేదల ప్రభుత్వం.. అదానీల ప్రభుత్వం కాదు..'

సారాంశం

Rahul Gandhi: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసిందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పేదల ప్రభుత్వం ఉంటుందని, అదానీల ప్రభుత్వం కాదని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ పేదల కోసం పని చేస్తుందని, భవిష్యత్తులో కూడా అదే పని చేస్తుందని అన్నారు.

Rahul Gandhi: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసిందని, కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఇద్దరు ముగ్గురూ బిలియనీర్ల సంక్షేమం కోసం కృషి చేస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పేదల ప్రభుత్వం ఉంటుందని, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో  అదానీ ప్రభుత్వాలు కాకుండా పేదల ప్రభుత్వాలు నడుస్తున్నాయని అన్నారు.  తెలంగాణా,మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అదానీ ప్రభుత్వాలు కాకుండా.. పేదల ప్రభుత్వాలు నడుస్తోందని అన్నారు. 

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నవ రాయ్‌పూర్‌లో నిర్వహించిన 'రాజీవ్ యువ మితన్ సమ్మేళన్'కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లక్ష మందికి పైగా యువకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. అదానీపై విచారణకు పిఎం మోడీ ఆదేశించలేరని  అన్నారు. GST,పెద్ద నోట్ల రద్దు వంటి అనుచిత నిర్ణయాలు చిన్న వ్యాపారులను రోడ్డుపై పడేశారని అన్నారు. ఇది ప్రధాని మోడీ స్నేహితులకు ప్రయోజనం చేకూర్చడానికి జరిగిందని అన్నారు. బిజెపి ద్వేషం, హింసను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు.ద్వేషం మార్కెట్ లో ప్రేమ దుకాణం తెరవడమే కాంగ్రెస్ పార్టీ పని రాహుల్ గాంధీ అన్నారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగబోతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 90 స్థానాలకు గాను 68 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకోవడం గమనార్హం. అయితే బీజేపీ కేవలం 15 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. జేసీసీ(జే) ఐదు స్థానాల్లో గెలుపొందగా, దాని మిత్రపక్షం బీఎస్పీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం సభలో కాంగ్రెస్‌కు 71 మంది సభ్యులున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌