
Balasore Train Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు సహా మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 290 మందికి పైగా మృత్యువాత పడగా.. మరో 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అనేక కుటుంబాల్లో విషదం నెలకొంది. వేలాది మంది అనాధలుగా మారారు.
కాగా.. ఈ కేసులో విచారణ చేపట్టిన సీబీఐ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. ముగ్గురు రైల్వే అధికారులను ప్రధాన నిందితులుగా పేర్కొంది. ఇప్పటికే అరెస్టు అయినా ఆ ముగ్గురు నిందితులు సాక్షాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారని చార్జిషీట్ లో పేర్కొంది.
ఈ విషాద ఘటనకు సిగ్నలింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని పేర్కొంది. ఇందుకు సంబంధించిన అధికారులైన సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మహంతా, సెక్షన్ ఇంజనీర్ మహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ లపై హత్య నేరం తోపాటు సాక్షాలను ధ్వంసం చేయడం వంటి నేరపూరిత చర్యలకు పాల్పడ్డారని సిబిఐ అభియోగాలు మోపింది. ఇప్పటికే వారిపై భారత శిక్షాస్మృతిలోని 304, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
బహనాగ బజార్ స్టేషన్ సమీపంలోని లెవెల్ క్రాసింగ్ గేట్ నంబర్ 94 వద్ద మరమ్మతు పనులను ఎల్‌సి గేట్ నంబర్ సర్క్యూట్ రేఖాచిత్రాన్ని ఉపయోగించి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మహంతా చేసినట్లు సిబిఐ ఆరోపించింది.
అలాగే.. 79 సర్కూట్ దయాగ్రామ్ ఆధారంగా మరమ్మతు పనులను పర్యవేక్షించిన మహంత అన్ని పనులు పూర్తయిన తర్వాత సిగ్నల్ , ఇంటర్‌లాకింగ్ ఇన్‌స్టాలేషన్‌లను పరీక్షించడం, సరిదిద్దడం, మార్పులు చేయడం ఆమోదించబడిన ప్లాన్,సూచనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం నిందితుడి విధి అని సీబీఐ పేర్కొంది. కానీ ఆ పనులను నిందితుడు చేయలేదని, ఈ కారణాల వల్లనే మూడు రైళ్లు ఢీ కొన్నాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది.