
యూపీ ప్రచారంలో (up assembly polls) ప్రియాంక గాంధీ (priyanak gandhi) .. యోగి ఆదిత్యనాథ్‌పై (yogi adityanath) విరుచుకుపడ్డారు. ఆయన పాలనతో జనం విసుగెత్తిపోయారని.. కాంగ్రెస్ (congress) ఒంటరిగా పోరాటం చేస్తోందని ఆమె అన్నారు. ఈసారి అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయేనని ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు బహుజన్ సమాజ్ పార్టీ (bahujan samaj party) అధినేత్రి మాయావతిని (mayawati) ప్రియాంక గాంధీ పరామర్శించారు. ఢిల్లీలోని మాయావతి తల్లిదండ్రుల నివాసానికి వచ్చిన ప్రియాంక గాంధీ.. మాయావతిని ఓదార్చారు. మాయావతి తల్లి రాంరతి శనివారం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. మాయావతి మాతృమూర్తి రాంరతి మరణించినట్లు బీఎస్పీ (bsp) శనివారం సాయంత్రం పేర్కొంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. శనివారం తుది శ్వాస విడిచినట్లు పార్టీ తెలిపింది. ప్రస్తుతం ఆమె వయసు 92 సంవత్సరాలు. గతేడాది నవంబర్ 19న మాయావతి తండ్రి ప్రభుదయాల్ మరణించారు. ఆయన మరణించి ఏడాది కూడా గడవకముందే రాంరతి మరణించడంతో మాయావతి కన్నీటి పర్యంతమవుతున్నారు.
ALso REad:Priyanka Gandhi: ప్రియాంక మరో హామీ.. అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు నెలకు రూ. 10 వేలు..
అలాగే తాము అధికారంలోకి వస్తే వారికి నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ (congress manifesto) ఇచ్చారు. గౌరవ వేతనం పొందడం ఆశా కార్యకర్తల హక్కు అని, తమ పార్టీ ఈ హామీకి కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆశా వర్కర్లు చేసిన సేలవను అమమానించిందని ఆరోపించారు. వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రియాంక గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గోధమ, వరి పంటలు క్వింటాల్‌కు రూ. 2,500, క్వింటాల్ చెరకుకు రూ. 400ల చొప్పున కొనుగోలు చేస్తామని అన్నారు. తమ పార్టీకి ఓటు వేసిగెలిపిస్తే.. ప్రజలందరికీ రూ. 10 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.