ప్రియుడితో వెళ్లిపోయిందని.. యువతికి గుండు కొట్టించి..

Published : Nov 14, 2021, 04:05 PM IST
ప్రియుడితో వెళ్లిపోయిందని.. యువతికి గుండు కొట్టించి..

సారాంశం

బాలిక ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. బాలికను ప్రేమించిన వ్యక్తిపైనా ఇదే విధంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ప్రియుడితో వెళ్లిపోయిందని.. ఓ బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెను చిత్ర హింసలకు గురిచేసి.. గుండు కొట్టించి.. ముఖానికి నలుపు రంగు పూసి.. ఊరేగించాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ జిల్లాకు చెందిన ఓ 14ఏళ్ల బాలిక ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. ఈ కారణంతో.. సదరు బాలికను గ్రామస్థులు చిత్రహింసలకు గురిచేశారు. బాలికకు గుండు కొట్టించారు. అనంతరం.. బాలిక ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. బాలికను ప్రేమించిన వ్యక్తిపైనా ఇదే విధంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Also Read: హనుమంతుడి కాళ్లు మొక్కి.. ముందున్న హుండీ కొట్టేసిన దొంగ.. వైరల్ అవుతున్న వీడియో ఇదే

బాలిక చర్యల వల్ల తమ తెగకు చెడ్డపేరు వచ్చిందని.. ఆమెను శుద్ది చేసేందుకు ఈ శిక్ష విధించాం అంటూ... బాలిక తెగకు చెందిన గిరిజనులు పేర్కొన్నారు. అనంతరం వారి వర్గానికి చెందిన మరో వ్యక్తికి బాలికను ఇచ్చి వివాహం జరిపించారు. నవంబర్ 10న హారిజ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఈ వ్యవహారంలో 35 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు 22 మందిని అరెస్టు చేశారు. బాలిక ప్రేమించిన వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆమెను అపహరించి అత్యాచారం చేశాడని అధికారలు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?