కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాను విమానం నుంచి దింపి.. అరెస్ట్, విడుదల, మధ్యంతర బెయిల్..

Published : Feb 24, 2023, 08:58 AM IST
కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాను విమానం నుంచి దింపి.. అరెస్ట్, విడుదల, మధ్యంతర బెయిల్..

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన  అస్సాం పోలీసులు గురువారం ఆయనను అరెస్ట్‌ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య ఫిబ్రవరి 28వరకు ఆయనకు బెయిల్ మంజూరయ్యింది. 

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాను గురువారం నాడు అస్సాం పోలీసులు అరెస్టు చేశారు, ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై ఆయన మీద ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. ఈ క్రమంలో ఆయనను రాయ్‌పూర్‌ విమానం నుండి దించేశారు. దీంతో పార్టీ నాయకులు టార్మాక్‌పై నిరసన చేయడంతో హై డ్రామా  మొదలయ్యింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని తండ్రి పేరును తప్పుపట్టినందుకు ఖేరా ఈ వారం ముఖ్యాంశాలలో ఉన్నారు. ఆయనను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం తర్వాత ఢిల్లీ కోర్టు ఫిబ్రవరి 28 వరకు మధ్యంతర బెయిల్‌పై విడుదల చేసింది.

అస్సాంతో పాటు ఉత్తరప్రదేశ్ పట్టణాలైన వారణాసి, లక్నోలో తనపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని వాటినుంచి ఉపశమనం కల్పించాలని అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వుకు ఆదేశించిన తర్వాత, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలపై స్పష్టంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఖేరా తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీతో ఈ మేరకు తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని చెబుతూ ఖేరా..   "మేం ఖేరాను ఇప్పటికి  రక్షించాం, అయితే, తన ఉపన్యాసం ఇచ్చేప్పుడు వెనకాముందూ చూసుకోవాలి. ఖేరా విలేకరుల సమావేశంలో ప్రకటనలు చేశాడు. నేను కోర్టులో చెప్పలేని కొన్ని ప్రకటనలు చేసాడు, కానీ నేను వ్యక్తిగతంగా వాటిని మాట్లాడను" అని ఖేరా పార్టీ సహోద్యోగి కూడా అయిన సింఘ్వీ సుప్రీం కోర్టులో అన్నారు.

ఎన్సీపీలో ముదిరిన పోస్టర్ వార్.. 'కాబోయే సీఎం' అంటూ సుప్రియా సూలే ఫెక్సీ

పార్టీ ప్లీనరీ సమావేశానికి హాజరయ్యేందుకు ఛత్తీస్‌గఢ్ రాజధానికి వెళుతుండగా ఖేరాను విమానంలోనుంచి దింపేశారు. ఆ తరువాత గురువారం సాయంత్రం ద్వారకా కోర్టు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, చట్టం తనను రక్షించిందని, సుప్రీంకోర్టు తన స్వేచ్ఛను సమర్థించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. “నన్ను ఉగ్రవాదిగా భావించి డిప్లేన్ చేయమని అడిగారు. ప్రజల హక్కులు హరించబడుతున్నాయనడానికి ఇదొక్కటే ఉదాహరణ కాదు..."నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా నన్ను అరెస్టు చేశారు" అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు.

రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఖేరాపై పోలీసు చర్యను మోదీ "ప్రతీకార, వేధింపు,  బెదిరింపు" రాజకీయాలకు కొత్త ఉదాహరణగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిపై ఖేరా "అవమానకరమైన వ్యాఖ్యలు" ఉపయోగించారని అస్సాం పోలీసులు కోర్టులో తెలిపారు. ప్రధానిపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారని, ఆయనపై వచ్చిన ఆరోపణలకు అరెస్టు చేయాల్సిన అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.

ఖేరాపై అస్సాంలోని హఫ్లాంగ్ పోలీస్ స్టేషన్‌లో 153 బి (ఆరోపణలు, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వాదనలు), 500 (పరువునష్టం కోసం శిక్ష), 504 (ఉల్లంఘనను ప్రేరేపించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) సహా IPCలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.

"ప్రధానమంత్రికి వ్యతిరేకంగా అతని (ఖేరా) వ్యాఖ్యలు ఎఫ్‌ఐఆర్‌లో ఒక భాగం. ఇతర ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఐపిసిలోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది" అని డిమా హసావో పోలీసు సూపరింటెండెంట్ మయాంక్ కుమార్ చెప్పారు. శామ్యూల్ చాంగ్సన్ అనే వ్యక్తి బుధవారం హఫ్లాంగ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. గౌతమ్ అదానీ నేతృత్వంలోని వ్యాపార సమ్మేళనానికి సంబంధించిన వివాదంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఖేరా ప్రధానిని "నరేంద్ర గౌతమ్‌దాస్ మోడీ" అని సంబోధించారు.

మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ, మధ్య పేరు దామోదరదాస్ తన తండ్రి పేరును సూచిస్తుంది, ఇది దేశంలోని అనేక ప్రాంతాలలో సాధారణం. ప్రధాన మంత్రి, అతని దివంగత తండ్రిని ఖేరా ఎగతాళి చేశారని బిజెపి నాయకులు ఆరోపించారు.

ఖేరాకు మద్దతుగా సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు తారురోడ్డుపై కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కెసి వేణుగోపాల్ కూడా మాట్లాడుతూ, పార్టీ ప్లీనరీ సమావేశాన్ని బిజెపి లక్ష్యంగా చేస్తోందని ఆరోపించారు. "వారు ఈ పనులు చేస్తున్న తీరు పూర్తిగా ఖండించదగినది. మేమంతా ప్లీనరీకి రాయ్‌పూర్‌కి వెళ్తున్నాం, పవన్ ఖేరా కూడా మాతో ప్రయాణిస్తున్నాడు, ఎటువంటి సరైన కారణం లేకుండా వారు అకస్మాత్తుగా పవన్ ఖేరాను దింపేశారు" అని వేణుగోపాల్ చెప్పారు.

"అరగంట తర్వాత, ఢిల్లీ పోలీసులు వచ్చి ఖేరాను అస్సాం పోలీసులకు అప్పగించాలని చెప్పారు. ఎఫ్‌ఐఆర్, అరెస్ట్ వారెంట్ లేదా ఏదైనా పత్రం ఉందా అని అడిగాం, కానీ ఏమీ లేదు, మౌఖిక ఆదేశాలు మాత్రమే అని తెలిపారు" అని కాంగ్రెస్ పేర్కొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం